Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్ ఎవర్ గ్రీన్
80వ వసంతంలోకి బిగ్ బి
Amitabh Bachchan : భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర కనబరుస్తూ వచ్చిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు. అక్టోబర్ 11, 1942లో పుట్టారు. ఆయన తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ ప్రముఖ కవి. బాలీవుడ్ లో కీలకమైన నటుడిగా ఉన్నారు. 1970 లో విడుదైలన జంజీర్ , దీవార్ సినిమాలతో పేరొందారు.
ఒకనాడు సినిమాలకే పనికి రాడని తిరస్కరణకు గురైన అమితాబ్(Amitabh Bachchan) ఇవాళ పాపులర్ నటుడుగా నిలిచారు. నటనా పరంగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ప్రసిద్ది పొందారు. బాలీవుడ్ లో షెహెన్ షా , స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే బిరుదులు పొందారు.
1970, 80లలో అమితాబ్ ఆధిపత్యం కొనసాగింది. ఆనాడు ఫ్రెంచి దర్శకుడు ఫ్రాంన్సిస్ ట్రేఫట్ భారతీయ సినిమాని ఒన్ మ్యాన్ ఇండస్ట్రీగా అభివర్ణించారు. ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. 15 ఫిలిం ఫేర్ అవార్డులు గెలుపొందారు.
ఉత్తమ నటుడికి 40 సార్లు ఏకంగా నామినేట్ అయ్యారు. బిగ్ బి నటుడిగా, గాయకుడిగా, ప్రయోక్తగా, నిర్మాతగా ఉన్నారు. కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో మోస్ట్ పాపులర్ అయ్యారు అమితాబ్ బచ్చన్. అంతే కాకుండా 1980లలో రాజకీయాలలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు.
1984లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషణ్ , 2015లో పద్మ విభూషణ్ తో సత్కరించింది. 2007లో ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం లెగియన్ ఆఫ్ హానర్ తో గౌరవించింది. యూపీలోని అలహాబాద్ లో పుట్టారు అమితాబ్ బచ్చన్. కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్. అమితాబ్ బచ్చన్ రేఖతో ప్రేమలో పడ్డారు.
చివరకు ఆయన జయా బచ్చన్ ను పెళ్లి చేసుకున్నారు. రేఖ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. శ్వేతా నంద కూతురు కూడా ఉన్నారు. 1969లో భువన్ షోం అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. 1971లో ఆనంద్ లో నటించాడు. పర్వానాలో ప్రతి నాయకుడిగా నటించారు. జంజీర్ తో బిగ్ బీ నటుడిగా స్థిరపడ్డారు.
కభీ కభీ మూవీ సెన్సేషన్ . నేటికీ అందులోని పాటలు అలరారుతూనే ఉన్నాయి. లావారీస్ ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది సినిమాలు అమితాబ్ బచ్చన్ నటనతో విజయాలు సాధించాయి. బిగ్ బి కెరీర్ లో 1975లో కీలకం అని చెప్పక తప్పదు. దీవార్ , షోలే సినిమాలు బిగ్ సక్సెస్ అయ్యాయి.
బాలీవుడ్ 25 చిత్రాల జాబితాలో ఈ సినిమాను చేర్చింది. ఇక షోలో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆనాడే 60 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. 1999లో బీబీసీ ఇండియా ఈ మూవీని ఫిలిం ఆఫ్ ద మిలీనియం గా పేర్కొంది షోలేను. 1976లో యశ్ చోప్రా దర్శకత్వం వహించిన రొమాంటిక్ మూవీ కభీ కభీ తో ఎటువంటి పాత్రలైనా చేయగలనని నిరూపించారు అమితాబ్ బచ్చన్.
యువ కవి పాత్రలో నటించారు. ముఖద్దార్ కా సికిందర్ మూవీ సెన్సేషన్ . సుహాగ్ , మిస్టర్ నట్వర్ లాల్ , కాలా పత్తర్ , ది గ్రేట్ గేంబ్లర్
సినిమాలు సక్సెస్ అయ్యాయి. 1981లో యశ్ చోప్రా తీసిన సిల్ సిలా సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఇందులో జయా బచ్చన్ , రేఖ నటించారు.
రాం బలరాం, నసీబ్, లావారీస్ సూపర్. 1982 జూలై 26న కూలీ సినిమా షూటింగ్ సందర్భంగా గాయం కావడంతో దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. 1983లో బిగ్ హిట్ అయ్యింది కూలీ మూవీ. 1984లో తన ఫ్రెండ్ రాజీవ్ గాంధీకి మద్దతుగా రాజకీయాల్లోకి వచ్చారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమితాబ్ కు అమర్ సింగ్ సాయం చేశారు. సమాజ్ వాది పార్టీలో చేరారు. ఆ తర్వాత దూరంగా ఉన్నారు. నిర్మాతగా సక్సెస్ కాలేదు. 2000లో ఆదిత్యా చోప్రా తీసిన మొహబ్బతే సినిమాలో నటించారు అమితాబ్. ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. 2005లో బ్లాక్ మూవీ ఆదరణ చూరగొంది.
రామ్ గోపాల్ వర్మ తీసిన సర్కార్ మూవీ సెన్సేషన్ గా నిలిచింది. 2010లో కేబీసీ నాల్గవ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం
మోస్ట్ పాపులర్ ప్రోగ్రాంగా నిలిచింది. ఏది ఏమైనా అమితాబ్ బచ్చన్ మన కాలంలో జీవించి ఉన్నందుకు గర్వపడాలి.
Also Read : అమితాబ్..కలకాలం జీవించు – మోదీ