Arun Dhumal : ఐపీఎల్ చైర్మ‌న్ రేసులో అరుణ్ ధుమాల్

అక్టోబ‌ర్ 18న బీసీసీఐ కార్య‌వ‌ర్గం ఎన్నిక

Arun Dhumal : దేశంలోనే అత్య‌ధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ‌గా పేరొందిన బీసీసీఐకి అక్టోబ‌ర్ 18న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న బీసీసీఐ బాస్ సౌర‌వ్ గంగూలీ త‌న ప‌ద‌వీ కాలం పూర్తి చేసుకున్నారు.

అత‌డి స్థానంలో క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ ఆఫీస్ బేర‌ర్ గా ఉన్న మాజీ ఆల్ రౌండ‌ర్ ,1983 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన భార‌త జ‌ట్టులో స‌భ్యుడైన రోజ‌ర్ బిన్నీ ప్రస్తుతం గంగూలీ ప్లేస్ లో రానున్నారు. ఆల్ రెడీ ఆయ‌న ఎన్నిక పూర్తి అయిన‌ట్టేన‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక బిసీసీఐ ఎన్నిక‌ల నామినేష‌న్లు ఈనెల 12 వ‌ర‌కు క్లోజ్ అవుతాయి. 14న నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ జ‌రుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లువురి పేర్లు వినిపిస్తున్నా ప్ర‌ధానంగా పోటీ ప్ర‌స్తుతం ఐపీఎల్ చైర్మ‌న్ పైనే ఉంటోంది. ఇక బీసీసీఐకి సంబంధించి అధ్య‌క్షుడు, ఉపాధ్య‌క్షుడు, కార్య‌ద‌ర్శి, జాయింట్ సెక్ర‌ట‌రీ , కోశాధికారి స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు చ‌క్రం తిప్పుతూ వ‌స్తున్న కార్య‌ద‌ర్శి ప‌ద‌విలో ఉన్న జే షా తిరిగి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ఆయ‌న త‌న స్థానాన్ని కొన‌సాగించాల‌ని భావిస్తున్నారు. అనుభ‌వం క‌లిగిన అడ్మినిస్ట్రేట‌ర్ గా పేరున్న రాజీవ్ శుక్లా బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా కొన‌సాగుతారు.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌ద‌ర్శిగా ఉన్న అరుణ్ సింగ్ ధుమాల్(Arun Dhumal) స్థానంలో ఆశిష్ సెల్లార్ రావ‌చ్చ‌ని అంచ‌నా. కాగా ధుమాల్ ఐపీఎల్ చైర్మ‌న్ గా ఎన్నిక‌య్యే అవ‌కాశం ఉంది. జోరుగా ప్ర‌చారం కూడా జరుగుతోంది. మొత్తంగా దాదా, జేషా స‌పోర్ట్ ధుమాల్ కు ఉండ‌డం విశేషం.

Also Read : స‌మ ఉజ్జీల పోరులో విజేత ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!