5G Jio Airtel : జియో..ఎయిర్ టెల్ 5జీ సేవలు షురూ
టెలికాం కంపెనీల ప్రయోగం
5G Jio Airtel : దేశంలో మరో కొత్త విప్లవానికి నాంది పలకబోతోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగానే 5జీ సర్వీసెస్ ప్రారంభం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఈ సేవలు పొందాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ సందర్భంగా కేవలం నాలుగు నగరాలలో ప్రారంభిస్తామని ఆయా కంపెనీలు ప్రకటించాయి.
ఇప్పటికే స్పెక్ట్రమ్ వేలం పాటలో 5జీ సర్వీసెస్ కు సంబంధించి బిడ్ దాఖలు చసినవన్నీ ఇప్పుడు సర్వీసెస్ అందించేందుకు టెస్టింగ్ మొదలు పెట్టాయి. త్వరలోనే మరో 13 నగరాలలో 5జీ సర్వీసులు అందజేస్తామని ప్రకటించాయి. తాజాగా ఢిల్లీలో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి.
కొద్ది రోజుల కిందట రిలయన్స్ జియో ఇండియా మొబైల్ సర్వీస్ ఈవెంట్ సందర్భంగా తన సర్వీసు ను ప్రారంభించింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్ కతా, వారణాసిలో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక మరికొన్ని నగరాలకు విస్తరిస్తామని తెలిపింది జియో. ఇదిలా ఉండగా కంపెనీ అర్హులైన యూజర్లకు 1జీబీపీఎస్ ఫ్రీ అన్ లిమిటెడ్ పేరుతో డేటాను అందిస్తోంది.
టెస్టింగ్ లో ఏకంగా 600 ఎంబీపీఎస్ మార్క్ దాటింది డౌన్ లోడ్ విషయంలో. టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్ టెల్ కొంత కాలం నుంచీ 5జీ టెస్టులు చేస్తున్నాయి. ఇక ఎయిర్ టెల్ ఎనిమిది నగరాలలో 5జీ సేవలు(5G Jio Airtel) అందిస్తోంది.
ఇటీవల సర్వే చేసిన ప్రకారం దేశంలో దాదాపు 89 శాతం మంది భారతీయులు 5జీకి అప్ గ్రేడ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నట్లు తేలింది.
Also Read : భారత్ లో యాపిల్ ఎయిర్పాడ్ల తయారీ