IND vs SA 3rd ODI : సౌతాఫ్రికా విలవిల భారత్ కళకళ
2-1 తేడాతో వన్డే సీరీస్ కైవసం
IND vs SA 3rd ODI : శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో జరిగిన వన్డే సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన కీలకమైన మూడో వన్డే మ్యాచ్ లో(IND vs SA 3rd ODI) భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి పర్యాటక జట్టు 27.1 ఓవర్లలోనే 99 పరుగులకే చాప చుట్టేసింది.
భారత జట్టు కెప్టెన్ ధావన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతడి ప్లాన్ వర్కవుట్ అయ్యింది. సఫారీ జట్టు ఆటగాళ్లు పరుగులు తీసేందుకు నానా తంటాలు పడ్డారు. 100 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్ బలమైన ఆరంభాన్ని అందించారు.
ధావన్ 8 పరుగుల వద్ద నిష్క్రమించగా శుభ్ మన్ గిల్ 49 పరుగులు చేశాడు. ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ ముగించాడు. సంజూ శాంసన్ నాటౌట్ గా మిగిలాడు. వన్డే మ్యాచ్ లలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది దక్షిణాఫ్రికా జట్టు. టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ 4.1 ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
సఫారీ టీంను కోలుకోలేని దెబ్బ తీశాడు. వాషింగ్టన్ సుందర్ క్వింటన్ డికాక్ ను పెవిలియన్ పంపించాడు. మహ్మద్ సిరాజ్ జననేమన్ మలన్ , రీజా హెండ్రిక్స్ లను ఔట్ చేశాడు. మార్కరామ్ ను షాబాజ్ పడగొట్టాడు. 7 పరుగుల వద్ద స్టాండ్ ఇన్ కెప్టెన్ డేవిడ్ మిల్లర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
కుల్దీప్ ఆ తర్వాత టైలెండర్లను పంపించాడు. దీంతో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సీరీస్ కైవసం చేసుకుంది.
Also Read : పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతున్నా