Bhavish Aggarwal : టెస్లాను ఢీకొనేందుకు ఓలా రెడీ – అగర్వాల్
ఎలోన్ మస్క్ కు ఓలా సీఇఓ సవాల్
Bhavish Aggarwal : ప్రపంచంలోనే విద్యుత్ వాహనాల తయారీలో నెంబర్ వన్ గా కొనసాగుతోంది టెస్లా. దాని వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్(Elon Musk). ప్రపంచ కుబేరుల్లో టాప్ లో కొనసాగుతున్నారు. వరల్డ్ వైడ్ గా బిగ్ మార్కెట్ కలిగి ఉంది ఈ సంస్థ. కాగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల మధ్య భారీ ఎత్తున పోటీ నెలకొంది.
ఇండియాలో టాటా, మహీంద్రా, తదితర బడా కంపెనీలు విద్యుత్ వాహనాలను ఇప్పటికే తయారు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఓలా కూడా టెస్లాను ఢీకొనేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించింది. టెస్లా సిఇఓ ఎలోన్ మస్క్ కు సవాల్ విసిరారు ఓలా సిఇఓ భవిష్ అగర్వాల్(Bhavish Aggarwal) .
ఎంత మందికైనా అత్యంత నాణ్యవంతమైన, సౌకర్యవంతంగా ఉండేలా విద్యుత్ వాహనాలను తయారు చేసే సత్తా తమకు ఉందని స్పష్టం చేశారు సిఇఓ. అల్ట్రా చౌక ఎలక్ట్రిక్ కార్లతో ఎలోన్ మస్క్ కు ధీటుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారంటూ బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది.
ప్రపంచం లోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీదారుగా ఓలాకు పేరుంది. ఇప్పటికే అన్ని దేశాలకు ఇది విస్తరించింది. ఆకట్టుకునే డిజైన్ , అందరికీ అందుబాటులో ఉండే ధరలో తయారు చేయడంతో భారీ ఆదరణ చూరగొంటోంది.
భవిష్ అగర్వాల్ కు 37 ఏళ్లు. భారత దేశంలో అత్యంత వేగవంతమైన వ్యాపారవేత్తలలో ఒకడిగా నిలిచారు. తక్కువ ధర డిజైన్లలో సముచిత స్థానాన్ని ఏర్పర్చడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో టాప్ లో ఉన్నారు. స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఏర్పడినా తర్వాత ఓలాకు తిరుగు లేకుండా పోయింది.
Also Read : 77,654 స్కామ్ లు 60 వేల 530 కోట్లు ఫ్రాడ్