Bhagwant Mann : భగవంత్ మాన్ ఓ బందూక్
ఈ మాన్ మామూలోడు కాదు
Bhagwant Mann : పంజాబ్ సీఎంగా కొలువు తీరిన భగవంత్ మాన్(Bhagwant Mann) పుట్టిన రోజు ఇవాళ. ఆయనకు 49 ఏళ్లు. పంజాబ్ లో సామాన్యుడి చేతిలో ఆయుధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు భగవంత్ మాన్. ఒక రకంగా చెప్పాలంటే మాన్ మామూలోడు కాదు. నటుడు, నాయకుడు.
సమాజాన్ని భిన్నమైన కోణాలలో ఆవిష్కరించడంలో దిట్ట. విచిత్రం ఏమిటంటే షో నిర్వాహకుడిగా ఉన్న పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్, మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ సమక్షంలో తన ప్రదర్శన నిర్వహించాడు భగవంత్ మాన్. అదే మాన్ ఇప్పుడు పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే సిద్దూ జైలులో ఊచలు లెక్క బెడుతున్నాడు.
కాలం చాలా విచిత్రమైనది. ఇది ఎవరిని ఎప్పుడు ఎలా పైకి తీసుకు వెళుతుందో చెప్పలేరు. మాన్ పై ఆరోపణలు కూడా లేక పోలేదు. ఆయన మద్యానికి బానిస అన్నది ప్రధానమైన విమర్శ.
పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో సమావేశాలకు తాగి వస్తాడని ఆరోపణ ఉంది. దానిపై విచారణ కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు.
కానీ భగవంత్ మాన్ అద్భుతమైన హాస్యాన్ని పండించలగడు. అందుకే నాయకుడు అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంట్ లో ఆప్ తరపున ప్రజా సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించడంలో కీలక పాత్ర పోషించాడు. రైతుల ఆందోళన సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగాడు భగవంత్ మాన్(Bhagwant Mann).
ప్రజా సమస్యలను అత్యంత సెటైరిక్ గా ప్రస్తావించడడంలో ఆయన తర్వాతే ఎవరైనా. గతంలో ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొంది పంజాబ్ రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
భగవంత్ మాన్ గురించి చెప్పాల్సింది ఇంకొకటి ఉంది. అదేమిటంటే ఆయనకు సర్దార్ షహీద్ భగత్ సింగ్ అంటే చచ్చేంత అభిమానం.ఆయన కోసం వీలైతే ప్రాణం తీసుకునేందుకు సిద్దమని ఒకసారి ప్రకటించి సంచలనం కలిగించాడు.
అందరూ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తే మాన్ మాత్రం కొంగర్ కలాన్ లో ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన పాలన సాగిస్తున్న మాన్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుందాం.
Also Read : అరెస్ట్ అయ్యేందుకు సిద్ధం – సిసోడియా