Congress Chief Poll : పోలింగ్ ముగిసింది ఫలితమే మిగిలింది
అక్టోబర్ 19న ఫలితాలు వెల్లడి
Congress Chief Poll : 137 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి(Congress Chief Poll) సంబంధించి సోమవారం జరిగిన పోలింగ్ సాయంత్రంతో ముగిసింది. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి ఓటు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం వేశారు. అనంతరం ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తో పాటు పలువురు కీలక నేతలు ఓట్లు వేశారు.
సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 9,000 మంది ప్రతినిధులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇక ఇవాళ జరిగిన పోలింగ్ ముగియడంతో అక్టోబర్ 19న ఎన్నికకు సంబంధించి ఫలితాన్ని ప్రకటిస్తారు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ , చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ. ఇక అధ్యక్ష బరిలో కర్ణాటకకు చెందిన రాజ్య సభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఉన్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉన్నారు. ఇక పార్టీకి సంబంధించి 37వ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారనేది బుధవారం నాడు తేలనుంది. దేశ వ్యాప్తంగా సభ్యులందరికీ పార్టీ పరంగా ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేశారు. మొత్తం ఓటు వేసేందుకు గాను 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పోటీ మాత్రం నువ్వా నేనా అన్న రీతిలో సాగినా సోనియా గాంధీ కుటుంబం ఆశీస్సులు పూర్తిగా మల్లికార్జున్ ఖర్గేకు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఆధునిక భావాలు కలిగిన శశి థరూర్ కాస్తా వెనుక పడినట్లు టాక్.
Also Read : భారత్ బ్రాండ్ పేరుతో ఎరువుల విక్రయం – మోదీ