Bhagat Singh Comment : భ‌గ‌త్ సింగ్ తో పోలిక త‌గునా

మండే అగ్నిక‌ణం అజ‌రామ‌రం

Bhagat Singh Comment : నూనుగు మీసాల య‌వ్వ‌నాన్ని దేశం కోసం త్యాగం చేసిన ధీరోదాత్తుడు స‌ర్దార్ ష‌హీద్ భ‌గ‌త్ సింగ్(Bhagat Singh). కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు, యువ‌తీ యువ‌కుల‌కు అత‌డో ఐకాన్. ప్ర‌పంచంలో చేగువేరా ఎంత‌టి ప్ర‌భావాన్ని చూపుతున్నారో స‌మున్న‌త భార‌తంలో భ‌గ‌త్ సింగ్ అంతే స్పూర్తి ర‌గిలిస్తూ వ‌స్తున్నారు.

బ‌తికేందుకు అవ‌కాశం ఉన్నా దేశ స్వాతంత్రం కోసం త‌న విలువైన ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన వాడు భ‌గ‌త్ సింగ్. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేసిన వాడు ష‌షీద్. స్మ‌రించు కోవ‌డం వేరు. నివాళులు అర్పించు కోవడం వేరు.

యావ‌త్ ప్ర‌పంచాన్ని, దాని గ‌మ‌నాన్ని, గ‌తి శీల‌త‌ను అర్థం చేసుకున్నాడు భ‌గ‌త్ సింగ్. దేశ ఆర్థిక‌, సామాజిక‌, రాజ‌కీయ కోణాల‌ను దాని వెనుక ఉన్న మ‌ర్మాల‌ను ఆనాడే ప‌సిగ‌ట్టాడు. అందుకే నా దేశం దాస్య శృంఖ‌లాల‌ను తెంచ‌డమే నా ముందున్న ల‌క్ష్య‌మ‌న్నాడు. ఆనాటి పాల‌కులకు కంటి మీద నిద్ర లేకుండా చేసిన పోరాట యోధుడు భ‌గ‌త్ సింగ్.

ఉరి శిక్ష వేసినా న‌వ్వుతూ స్వీక‌రించిన మ‌హోన్న‌త మాన‌వుడు. ఇలాంటి యోధుల‌ను క‌న్నది భ‌ర‌త మాత‌. భ‌గ‌త్ సింగ్(Bhagat Singh), రాజ్ గురు , సుఖ్ దేవ్ త‌మను తాము అర్పించుకున్నారు. దేశం కోసం బ‌లిదానం చేశారు. అలాంటి వాళ్ల గురించి ఇంకొక‌రితో పోల్చ‌డం ఎన్న‌టికీ స‌రికాదు. చ‌రిత్ర క్ష‌మించ‌దు.

ఇవాళ ఎందుకు భ‌గ‌త్ సింగ్ గురించి ప్ర‌స్తావించాల్సి వ‌స్తుందంటే..ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌లు. ఆప్ నాయ‌కులు సీఎంతో పాటు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ కూడా భ‌గ‌త్ సింగ్ ను, ఇంక్విలాబ్ జిందాబ్ అన్న నినాదాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తుంటారు.

ఇందులో త‌ప్పు ప‌ట్ట‌డానికి ఏమీ లేదు. కానీ ఎంతో అనుభవం క‌లిగిన‌, పోరాట నేప‌థ్యం ఉన్న కేజ్రీవాల్ మ‌రీ ఇంత దిగ‌జారి భ‌గ‌త్ సింగ్ ను త‌న కేబినెట్ మంత్రులైన స‌త్యేందర్ జైన్ , మ‌నీష్ సిసోడియాతో పోల్చ‌డం విస్తు పోయేలా చేసింది. భ‌గ‌త్ సింగ్ ఏ ప‌ద‌విని కోరుకోలేదు.

కానీ మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆ ఇద్ద‌రిని ష‌హీద్ తో పోల్చ‌డం భావ్యం కాదు. దీనిని ప్ర‌త్యేకంగా ఎత్తి చూపారు పంజాబ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్. వాళ్ల‌కు భ‌గ‌త్ సింగ్ తో పోలిక‌లు ఏంటి అని. ఇక‌నైనా ముందు వెనుకా ఆలోచించి మాట్లాడితే కేజ్రీవాల్ కు మంచిది. దేశానికి మంచిది. లేక‌పోతే చ‌రిత్ర క్ష‌మించ‌ద‌న్న వాస్త‌వాన్ని గుర్తిస్తే బెట‌ర్.

Also Read : స్వాతి మ‌లివాల్ ఇంటిపై దాడి

Leave A Reply

Your Email Id will not be published!