Jayalalitha Death Comment : అంతు చిక్కని ‘అమ్మ’ మరణం
కుండ బద్దలు కొట్టిన కమిషన్ నివేదిక
Jayalalitha Death Comment : జయలలిత ఈ పేరు వింటే పూనకాలు వస్తాయి. ఆమె కోసం గుడి కట్టారు. బతికి ఉండగానే దేవతగా పూజించారు తమిళనాడు వాసులు. సీఎంగా ఉండగానే జయలలిత(Jayalalitha Death) కన్ను మూశారు. 2016లో లోకాన్ని వీడిన ఆమె మృతిపై నేటికీ ఎన్నో అనుమానాలు..మరెన్నో ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఎలా మరణించిందనే దానిపై ఏర్పాటైన కమిషన్ సంచలన విషయాలు బయట పెట్టింది తన నివేదికలో. ఆనాటి సర్కార్ మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి
ఏ. ఆర్ముగస్వామి సారథ్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఇవాళ తన నివేదికను సీఎం ఎంకే స్టాలిన్ కు అందజేశారు. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
ఇదంతా పక్కన పెడితే ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు ఒక్కసారిగా తమిళనాడును విస్తు పోయేలా చేశాయి. ప్రధానంగా ఆనాటి జయలలిత పాలనా కాలంలో అన్నీ తానై వ్యవహరించింది వీకే శశకళ. ఆమె కనుసన్నలలోనే పాలన సాగింది. రాష్ట్రాన్ని రాజ్యాంగేతర శక్తిగా తన పవర్ చూపించింది.
లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించింది. కళ్లు చెదిరే నోట్ల కట్టలు, లెక్కించలేనంత ఆభరణాలు, ఆస్తులు, నివాస స్థలాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.
చివరకు జైలు పాలైంది. ఆ తర్వాత తిరిగి వచ్చింది. సీఎం కావాలని అనుకుంది. తాను పోటీ చేయనంటూ ప్రకటించింది. శపథం చేసింది.
ప్రస్తుతం తానే జయలలితకు వారసురాలినని, అన్నాడీఎంకే తానేనంటోంది. ఇదిలా ఉండగా ఆర్ముగస్వామి కమిషన్ లో ప్రధానంగా వీకే శశికళ వైఖరిని
తీవ్రంగా తప్పు పట్టింది. ఆమె వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది.
అంతే కాకుండా జయలలిత కాలంలో పని చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుతో పాటు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ కుమార్ , తప్పుడు ప్రకటనలు ఇచ్చిన అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ రెడ్డిలను ప్రాసిక్యూట్ చేయాలని స్పష్టం చేసింది కమిషన్.
ఈ మొత్తం నివేదిక ఇప్పుడు తమిళనాడునే కాదు దేశ వ్యాప్తంగా ప్రధాన చర్చకు దారితీసింది. 2016లో మరణించిన నాటి నుంచి నేటి దాకా జయలలిత
మరణంపై రోజుకో కథనం బయటకు వస్తూనే ఉన్నది. 2017లో హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏ ఆర్ముగ స్వామిని ఏరికోరి నియమించింది అప్పటి ప్రభుత్వం.
కాగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎంకే స్టాలిన్ జయలలిత మరణంపై(Jayalalitha Death) తాము పవర్ లోకి వస్తే విచారణ
జరిపిస్తామని , అసలు వాస్తవాలు బయటకు తెస్తామని ప్రకటంచారు. ఊహించని రీతిలో డీఎంకే అధికారంలోకి వచ్చింది. జయలలిత మృతిపై ఏర్పాటైన కమిషన్ విచారణ వేగవంతం చేసింది.
పూర్తి నివేదికను తయారు చేసి అక్టోబర్ 18న సీఎం స్టాలిన్ కు అందజేసింది. ప్రస్తుతం ఇంకా ఏమేం అంశాలు ఉన్నాయోనని అన్నాడీఎంకే నేతల్లో గుబులు రేగుతోంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో చెరపలేని నాయకుల్లో ఎంజీఆర్, కరుణానిధి తర్వాత జయలలిత ఒకరిగా పేరొందారు.
ఇక కమిషన్ దర్యాప్తులో పన్నీర్ సెల్వం, శశికళ, దీప, దీపక్ , అపోలో వైద్యులు ఉన్నారు. ఐదేళ్ల తర్వాత నివేదిక బయటకు వచ్చింది. కమిషన్ 500
పేజీల నివేదికను తయారు చేసింది.
అంతే కాకుండా జయలలిత కాలంలో పని చేసిన ఐపీఎస్ లు, ఐఏఎస్ లతో పాటు 158 మందిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు.
అపోలో సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా చివరకు వారి ఆటలు సాగలేదు. పూర్తి నివేదికను కమిషన్ సమర్పించడం కలకలం రేపుతోంది.
పూర్తి స్థాయిలో విచారణ జరిపితే కానీ అసలు దోషలు ఎవరో దొంగలు ఎవరో నమ్మక ద్రోహం తలపెట్టిన వారెవరో తేలుతంది. ఇది బట్టబయలు కావాలంటే సీఎం స్టాలిన్ పైనే ఉంది.
Also Read : జయలలిత మరణం అనుమానాస్పదం