SL vs NED T20 World Cup : టి20 వరల్డ్ కప్ సూపర్ 12కు శ్రీలంక
నెదర్లాండ్స్ పై ఘన విజయం
SL vs NED T20 World Cup : తాడో పేడో తేల్చుకోవాల్సిన విపత్కర పరిస్థితిలో గట్టెక్కింది శ్రీలంక. ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైన టి20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ లోనే కోలుకోలేని షాక్ కు గురైంది. పిల్ల కూనలైన నమీబియా చేతిలో శ్రీలంకఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ తరుణంలో అసలు సూపర్ 12కు వెళుతుందో లేదోనన్న అనుమానం నెలకొంది లంకేయుల్లో.
చివరకు కీలకమైన లీగ్ మ్యాచ్ లో శ్రీలంక నెదర్లాండ్స్ పై(SL vs NED T20 World Cup) విక్టరీ సాధించడంతో ఊపిరి పీల్చుకుంది జట్టు. ఇదిలా ఉండగా యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ -2022 లో పాకిస్తాన్ ను ఫైనల్ లో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. కానీ అనూహ్యంగా అనామకులైన నమీబియా చేతిలో ఓటమి పాలైంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ల్రేలియా లోని గెలాంగ్ లోని ఆండ్రూ సైమన్స్ స్టేడియంలో గురువారం జరిగిన గ్రూప్ -ఎ లో శ్రీలంక జట్టు 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ను ఓడించింది. శ్రీలంక కెప్టెన్ దసున్ శంక మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుసాల్ మెండీస్ 44 బంతుల్లో 79 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక జట్టు 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
ఇక నెదర్లాండ్స్ జట్టు తరపున పేసర్ పాల్ వాన్ మీకెరెన్ 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అనంతరం బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు టార్గెట్ ఛేదనలో చతికిల పడింది. మహేష్ తీక్షణ 2 వికెట్లు తీస్తే వనిందు హసరంగ 3 వికెట్లు కూల్చాడు. ఒక వేళ యూఏఈపై నమీబియా గెలిస్తే గ్రూప్ -2 కి వెళుతుంది.
Also Read : భారత్ ఎవరి మాట వినదు – అనురాగ్ ఠాకూర్