Wasim Akram : జే షా కామెంట్స్ అక్రమ్ సీరియస్
క్రికెట్ ఎలా ఆడాలో మీరు చెబితే ఎలా
Wasim Akram : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి, ఏసీబీ చైర్మన్ జే షా(Jay Shah) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే దాయాదుల మధ్య అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. బీసీసీఐ కొత్త పాలకవర్గం అక్టోబర్ 18న కొలువు తీరింది. జే షా రెండోసారి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.
ఈ సందర్భగా కీలక ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది 2023లో పాకిస్తాన్ లో జరగబోయే ఆసియా కప్ లో భారత జట్టు వెళ్లడం లేదని వెల్లడించాడు. అయితే తటస్థ వేదికలపై ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా తీవ్ర అభ్యంతరం తెలిపాడు.
తాము వరల్డ్ కప్ ను బహిష్కరిస్తామని హెచ్చరించాడు. ఇంకా ఏడాది ఉండగానే బీసీసీఐ సెక్రటరీ ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని ప్రశ్నించాడు. ఇదిలా ఉండగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించాడు. ఆయన మీడియాతో ప్రత్యేకంగా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత్ ఎవరి మాట వినదని కుండ బద్దలు కొట్టాడు. భారత జట్టు వెళ్లే పరిస్థితులు పాకిస్తాన్ లో లేవన్నాడు. ఇందుకు హామీ ఇచ్చే సీన్ ఆ దేశానికి లేదని మండిపడ్డాడు. ఈ తరుణంలో పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ జే షాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ ఎలా ఆడాలో మీరు నేర్పిస్తే ఎలా అని నిలదీశాడు. ప్రస్తుతం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు (Wasim Akram) కలకలం రేపుతున్నాయి.
Also Read : టీమిండియా గెలవడం కష్టం – సెహ్వాగ్