Sanjay Raut : సంజయ్ రౌత్ కు షాక్ కస్టడీ పొడిగింపు
బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది కోర్టు. దీంతో మరోసారి కస్టడీ పొడిగించింది. మహారాష్ట్ర లోని పాత్రాచాల్ స్కాంకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అదుపులోకి తీసుకుంది.
లెక్కా పత్రం లేకుండా డబ్బులు చేతులు మారాయని ఆరోపించింది. అంతే కాకుండా సంజయ్ రౌత్ కు పలుసార్లు నోటీసులు పంపించినా పట్టించు కోలేదని పేర్కొంది. దీంతో స్వయంగా ఆయనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే సంజయ్ రౌత్ ఇంటిపై దాడి చేసింది.
ఆ తర్వాత పటిష్టమైన భద్రత మధ్య అదుపులోకి తీసుకుంది. దీనిని ఎంపీ సంజ్ రౌత్(Sanjay Raut) తీవ్రంగా తప్పు పట్టారు. ఇదంతా నరేంద్ర మోదీ, అమిత్ షా ఆడుతున్న నాటకంలో ఒక భాగమని ఆరోపించారు. తాను ఏదో ఒక రోజు బయటకు వస్తానని తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు సంజయ్ రౌత్.
కేంద్రం కావాలనే దేశంలో ప్రశ్నించే వారిని బయటకు రానీయకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. రాచరిక పాలన సాగుతోందని ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బయటకు రాకుండా కావాలని బెయిల్ రాకుండా ఒత్తిళ్లు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సంజయ్ రౌత్.
ఇదిలా ఉండగా వచ్చే నెల నవంబర్ 2న రౌత్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపనున్నట్లు ఈడీ స్పెషల్ కోర్టుకు తెలిపింది.
Also Read : దేశ సమగ్రతకు భంగం కలిగిస్తే ఊరుకోం