Jacqueline Fernandez : న‌టి జాక్వెలిన్ కు బెయిల్ పొడిగింపు

రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ

Jacqueline Fernandez : మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు జారీ చేసిన మ‌ధ్యంత‌ర బెయిల్ ను ఢిల్లీ కోర్టు పొడిగించింది. రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ ను కోర్టు విచారించ‌నుంది.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కేసులో కీల‌క నిందితుడుగా ఉన్న సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్ , ఇత‌రుల‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ కేసులో న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) కు జారీ చేసిన మ‌ధ్యంత‌ర బెయిల్ ను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు శ‌నివారం న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు పొడిగించింది.

రెగ్యుల‌ర్ బెయిల్ ,ఇత‌ర పెండింగ్ ద‌ర‌ఖాస్తుల‌పై విచార‌ణ‌ను వ‌చ్చే నెల‌కు వాయిదా వేసింది. ఛార్జ్ షీట్ , ఇత‌ర సంబంధిత ప‌త్రాల‌ను అందించాల‌ని కోర్టు ఈడీని ఆదేశించింది. విచార‌ణ సంద‌ర్భంగా ఫెర్నాండెజ్ త‌న లాయ‌ర్ ప్ర‌శాంత్ పాటిల్ తో క‌లిసి కోర్టుకు హాజ‌ర‌య్యారు.

ఆమె ఇటీవ‌ల భారీ ధ‌ర‌తో ఫ్లాట్ కొనుగోలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలా ఉండ‌గా స్టార్ బెయిల్ ధ‌ర‌ఖాస్తుపై ప్ర‌త్యుత్త‌రం దాఖ‌లు చేయాల‌ని ఈడీని కోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో మ‌ధ్యంత‌ర బెయిల్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) కు మంజూరైంది.

ఇదిలా ఉండ‌గా ఆగ‌ష్టు 17న ఢిల్లీ కోర్టులో చంద్ర‌శేఖ‌ర్ పై ద‌ర్యాప్తు సంస్థ దాఖ‌లు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ లో ఫెర్నాండెజ్ పేరును నిందితుడిగా పేర్కొంది.

కాగా ఈడీ మునుప‌టి చార్జ్ షీట్ ప్ర‌కారం ఫెర్నాండెజ్ తో పాటు మ‌రో న‌టి నోరా ఫ‌తేహి ని విచారించారు. నిందితుడి నుండి అత్యంత ఖ‌రీదైన బ‌హుమతులు, కార్ల‌ను పొందార‌ని తేలింది. దీనికి సంబంధించి ఆరా తీసింది ఈడీ.

Also Read : పునీత్ రాజ్ కుమార్ కు ‘క‌ర్ణాట‌క ర‌త్న‌’

Leave A Reply

Your Email Id will not be published!