Babar Azam : మన పోరాటం అద్భుతం కానీ ఓడి పోయాం
ఆ తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదు
Babar Azam : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ సూపర్ 12లో కోలుకోలేని షాక్ కు కోలుకోలేని షాక్ తగిలింది. దాయాదులైన పాకిస్తాన్, భారత్ జట్లు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరిగింది. ఊహించని రీతిలో భారత జట్టు మాజీ కెప్టెన్ , రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అడ్డు గోడలా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
కేవలం 53 బంతులు ఎదుర్కొని 4 భారీ సిక్సర్లు 6 ఫోర్లు 82 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. 4 వికెట్లతో ఘన విజయాన్ని సాధించింది. భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ యావత్ దేశం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరు కోహ్లీని ఆకాశానికి ఎత్తేశారు. ఈ తరుణంలో మ్యాచ్ ముగిసిన అనంతరం పాకిస్తాన్ జట్టు స్కిప్పర్ బాబర్ ఆజం సభ్యులను ఉద్దేశించి ప్రసంగించాడు.
అద్భుతంగా ఆడామని , కొన్ని తప్పులు జరిగాయని అందువల్ల ఓడి పోయామని పేర్కొన్నాడు. ఆటగాళ్లను అభినందిస్తూనే జాగ్రత్తగా ఉండాలని సూచించాడు కెప్టెన్. ఇక నుంచి మరింత ఉత్సాహంతో పని చేయాలని సూచించాడు. నేను ఏ ఒక్కరిని తప్పు పట్టదల్చుకోలేదు. మ్యాచ్ అన్నాక గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నాడు బాబర్ ఆజం(Babar Azam).
ఒక రకంగా చెప్పాలంటే చివరి బంతి వరకు మనం అద్భుతంగా పోరాడాం కానీ ఓటమి పాలయ్యామని స్పష్టం చేశాడు. ఇక భారత జట్టు కూడా పోరాడిందని ప్రశంసించాడు బాబర్ ఆజం. టోరీలో మరిన్ని కీలక మ్యాచ్ లు ఉన్నాయి. ఈ సమయంలో మరింత సమన్వయంతో సమర్థవంతమైన పోరాట పటిమను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు బాబర్ ఆజం.
Also Read : కోహ్లీ ఆట తీరుకు మిచెల్ మార్ష్ బౌల్డ్