Suella Braverman : సుయెల్లా బ్రేవర్‌మాన్ కు మళ్లీ ఛాన్స్
పునర్ నియామకంపై విమర్శల వెల్లువ
Suella Braverman : బ్రిటన్ ప్రధాన మంత్రిగా కొలువు తీరిన భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పలువురికి చెక్ పెట్టారు. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ కేబినెట్ లో చాలా మందికి ఉద్వాసన పలికారు. పీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కోలుకోలేని షాక్ ఇచ్చారు రిషి సునక్.
కాగా లిజ్ ట్రస్ కొలువు తీరిన వెంటనే సుయెల్లా బ్రేవర్ మాన్(Suella Braverman) ను తొలగించారు నిర్దాక్షిణ్యంగా. కానీ సునక్ వచ్చాక వెంటనే ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. పునర్ నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ప్రస్తుతం ఆమెను తిరిగి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయినా రిషి సునక్ వెనక్కి తగ్గడం లేదు. ఆయన తన మొదటి ప్రసంగంలోనే జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభం తో కొట్టుమిట్టాడుతోందని ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం మేలు చేకూర్చేందుకేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనల సాంకేతిక ఉల్లంఘనపై బ్రేవర్ మాన్ గత వారం నిష్క్రమించారు. కాగా సుయెల్లా బ్రేవర్ మాన్ భారత సంతతికి చెందిన వ్యక్తి. గతంలో చేపట్టిన హొం శాఖ కార్యదర్శిగా తిరిగి చేపట్టడం విశేషం. ఈ ప్రభుత్వానికి ప్రతి స్థాయిలో చిత్తశుద్ది, వృత్తి నైపుణ్యం , జవాబుదారీతనం ఉంటుందన్నారు రిషి సునక్.
అయితే బ్రిటన్ పీఎం తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన చర్యగా అభివర్ణించారు.
Also Read : వయసులో చిన్నోడు పాలనలో గట్టోడు