Elon Musk Shock : టాప్ ఎగ్జిక్యూటివ్స్ కు $100 మిలియన్లు
సిఇఓ..సీఎఫ్ఓ..లీగల్ హెడ్ లకు మస్క్ ఓకే
Elon Musk Shock : ప్రముఖ దిగ్గజ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ కొనుగోలు చేయడంతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొంత కాలంగా కొనుగోలు వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. చివరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ , చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సెగెల్, లీగల్ హెడ్ విజయా గద్దె లకు చెక్ పెట్టారు వస్తూనే ఎలోన్ మస్క్(Elon Musk).
వీళ్లందరికీ శ్రీముఖాలు అందజేశారు. డీల్ కుదిరిన మొదటి రోజు నుంచి నేటి దాకా వీరందరిపై గుర్రుగా ఉన్నారు ట్విట్టర్ చైర్మన్. ఆయన ఆఫీసులోకి ఎంట్రీ కాగానే సిఇఓ, తదితరులపై నోరు పారేసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఎలోన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్ వెళ్లగానే ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందం మేరకు టాప్ ఎగ్జిక్యూటివ్స్ కు $100 మిలియన్లు చెల్లించనున్నారు ఎలాన్ మస్క్.
వీటన్నింటిని సెటిల్ చేస్తేనే కానీ వారంతా బయటకు వెళ్లరు. ఇప్పటికే తాను ఎంత మొత్తమైనా చెల్లించేందుకు రెడీగా ఉన్నానంటూ మస్క్ డిక్లేర్ చేసినట్లు సమాచారం. బ్లూమ్ బర్గ్ లెక్కల ప్రకారం సీఇఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ ఒక ఏడాది కిందటే సిఇఓగా కొలువు తీరారు.
దాదాపు $50 మిలియన్లు అందనున్నాయి. 38 ఏళ్ల పరాగ్ 10 ఏళ్ల పాటు ట్విట్టర్ లో పని చేశారు. పరాగ్ తో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సెగల్ కు $37 మిలియన్లు, లీగల్ హెడ్ విజయా గద్దెకు $17 మిలియన్లు అందనున్నాయి.
ఆరోగ్య బీమా ప్రీమియంలను ఒక ఏడాది పాటు కవర్ చేయాల్సి ఉంటుంది ఎలాన్ మస్క్. ఒక్కొక్కరికి $31,000 ఉండనున్నాయి.
Also Read : కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్ డిక్లేర్