Parag Agarwal : ప‌రాగ్ అగ‌ర్వాల్ పై ఎందుకంత క‌క్ష

సిఇఓగా ఫెయిల్ అయ్యాడా

Parag Agarwal : ప్ర‌పంచ వ్యాప్తంగా సామాజిక మాధ్య‌మాల‌లో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు ప్ర‌వాస భార‌తీయుడైన ప‌రాగ్ అగ‌ర్వాల్. మోస్ట్ టాలెంటెడ్ ప్రొఫెష‌న‌ల్ గా పేరు పొందాడు ప‌రాగ్. ప్ర‌ముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్ట‌ర్ లో 10 ఏళ్ల పాటు ప‌ని చేశాడు. వివిధ హోదాల‌లో, వివిధ స్థాయిల‌లో త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక ట్విట్ట‌ర్ ను స్థాపించిన డార్సే సిఇఓ గా ఉన్నాడు. త‌న వార‌సుడు ప‌రాగ్ అగ‌ర్వాల్ (Parag Agarwal) అంటూ ప్ర‌క‌టించాడు. ఆయ‌న‌కే బాధ్య‌త‌లు అప్ప‌గించాడు. ఈ త‌రుణంలో కీల‌క‌మైన సిఇఓ ప‌ద‌విని అలంక‌రించిన ప‌రాగ్ అగ‌ర్వాల్ ట్విట్ట‌ర్ లో పెను మార్పులు తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

కానీ ఉన్న‌ట్టుండి టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్ ఎప్పుడైతే దానిపై క‌న్నేశాడో ఆనాటి నుంచీ ప‌రాగ్ అగ‌ర్వాల్ తో ప‌డ‌డం లేదు మ‌స్క్ కు. ఇక ఎగతాళి చేయ‌డం, అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ట్వీట్ల‌తో ప‌రాచ‌కాలు ఆడ‌డంతో చేస్తూ వ‌చ్చారు. అనుకోని త‌రుణంలో ఎలోన్ మ‌స్క్ వ‌శ‌మైంది ట్విట్ట‌ర్.

దీంతో ప్రారంభం నుంచి స‌ద‌భిప్రాయం లేని ఎలాన్ మ‌స్క్ ఉన్న‌ట్టుండి సిఇఓ ప‌రాగ్ అగ‌ర్వాల్, సిఎఫ్ఓ సెగెల్ , లీగ్ హెడ్ విజ‌యా గ‌ద్దె ఉన్నారు. మిగ‌తా టాప్ పొజిష‌న్ల‌లో ప‌ని చేస్తున్న వారికి భ‌రోసా ఇచ్చారు. 44 బిలియ‌న్ డాల‌ర్ల‌కు కొనుగోలు చేసిన మ‌స్క్ ఇప్పుడు తానే అన్నింటికీ సుప్రీం.

దీంతో వ‌రుస‌గా వ‌స్తూనే ప్ర‌క్షాళ‌న స్టార్ట్ చేశాడు. 2011లో ట్విట్ట‌ర్ లో చేరిన ప‌రాగ్ అగ‌ర్వాల్ కు 10 ఏళ్ల అనుబంధం ఉంది. ఐఐటీ బాంబే లో చ‌దివాడు. ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్ కు బెస్ట్ ఫ్రెండ్. 1,000 కంటే త‌క్కువ మంది ఉన్న స‌మ‌యంలో ట్విట్ట‌ర్ లో చేరాడు.

అంచెలంచెలుగా ఎదుగుతూ 2017లో చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ అయ్యాడు . 38 ఏళ్ల ప‌రాగ్ అగ‌ర్వాల్ భారీ టెక్నాల‌జీ కంపెనీకి నాయ‌క‌త్వం వ‌హంచిన వారిలో అత్యంత పిన్న వ‌య‌సు క‌లిగిన వ్య‌క్తిగా గుర్తింపు పొందాడు. అంతే కాదు సిఇఓ కూడా.

నకిలీ ఖాతాల విష‌యంలో ప‌రాగ్ అగ‌ర్వాల్ త‌న‌ను త‌ప్పుదోవ ప‌ట్టించాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు ఎలోన్ మ‌స్క్. మొత్తంగా ప‌రాగ్ అగ‌ర్వాల్ ను అత్యంత అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో పంపించినా ప్ర‌తిభ క‌లిగిన వాడు కావ‌డంతో ఎక్క‌డైనా ఛాన్స్ వ‌స్తుందన్న‌ది వాస్త‌వం.

Also Read : కంటెంట్ మోడ‌రేష‌న్ కౌన్సిల్ డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!