Narendra Singh Tomar : కాలుష్య నియంత్రణ రాష్ట్రాలదే
స్పష్టం చేసిన కేంద్ర మంత్రి నరేంద్ర థోమర్
Narendra Singh Tomar : దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పంజాబ్ , ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. పంజాబ్ లో 40 లక్షల హెక్టార్లలో వరి పంట పొట్టును దగ్ధం చేయడం ప్రారంభించారు.
దీని దెబ్బకు ఢిల్లీలో పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు స్కూళ్లను బంద్ చేసింది. ఈ మేరకు ఆప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ తరుణంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పంట పొట్టు దగ్ధంకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలపైనే ఉంటుందని స్పష్టం చేశారు. పొట్టు దగ్ధం నిర్వహణ కోసం రాష్ట్రాలకు నిధులు, యంత్రాలను సమకూర్చడం జరిగిందన్నారు. శుక్రవారం థోమర్(Narendra Singh Tomar) మీడియాతో మాట్లాడారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఉత్తర భారత రాష్ట్రాల్లో పెరుగుతున్న పొట్టును కాల్చే సంఘటనలపై వాపోయారు. దీనిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. పొట్టు దగ్ధం చేయడం రాజకీయ సమస్య కాదని, రాష్ట్రాలకు సంబంధించినదని మరోసారి స్పష్టం చేశారు.
వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్ రూపొందించిన పూసా డీకంపోజర్ పొట్ట దగ్ధాన్ని నియంత్రించడంలో ప్రభావంతంగా పని చేస్తుందని చెప్పారు థోమర్.
కోట్ల రూపాయలు ఖర్చ చేశాం. 2 లక్షల యంత్రాలను పంపిణీ చేశాం. కానీ ఇప్పటి వరకు పొగను కంట్రోల్ చేయడంలో విఫలం అయ్యారంటూ మండిపడ్డారు మంత్రి.
Also Read : వాయు కాలుష్యం హక్కుల సంఘం ఆగ్రహం