AUS T20 World Cup : ఆసిస్ సెమీస్ కు వెళ్లడం కష్టం
డిఫెండింగ్ ఛాంపియన్ కు కష్టకాలం
AUS T20 World Cup : దుబాయ్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ను మట్టి కరిపించి ఐసీసీ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. ఇవాళ కీలకమైన మ్యాచ్ శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య(AUS T20 World Cup) జరగనుంది. ఇప్పటికే గ్రూప్ -1 లో ఉన్న కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే సెమీ ఫైనల్ కు చేరింది.
ఈ ఐసీసీ మెగా టోర్నీలో సెమీస్ కు చేరిన మొదటి టీమ్ ఇదే కావడం విశేషం. ఈ తరుణంలో డిఫెండింగ్ ఛాంపియన్ సెమీస్ కు చేరుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఇవాళ శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఎవరు గెలుస్తారనేది తేలనుంది. సెమీస్ ఫైనల్ కు సంబంధించి రెండో బెర్తు శనివారం తేలనుంది.
మరో వైపు ఆఫ్గనిస్తాన్ తో జరిగిన కీలక పోరులో ఆస్ట్రేలియా చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టుగా గెలుపొందింది. విచిత్రం ఏమిటంటే అతి కష్టం మీద చెమటోడ్చి గెలుపొందింది. ఇప్పటికే ఆఫ్గాన్ జట్టులో స్టార్ ప్లేయర్ గా పేరొందిన ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ స్వదేశంలో ఆడుతున్న ఆసిస్ కు చుక్కలు చూపించాడు.
ఒకానొక దశలో గెలిచినంత పని చేసింది ఆఫ్గనిస్తాన్. రషీద్ ఖాన్ కేవలం 23 బంతులు ఆడి 3 ఫోర్లు 4 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 48 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చివరి ఓవర్ కీలకంగా మారింది. 17 రన్స్ వచ్చాయి. ఒక వేళ ఇంకో బంతి గనుక ఉంటే ఈజీగా గెలిచి ఉండేది ఆఫ్గనిస్తాన్. భారీ తేడాతో గెలిచి ఉంటే ఆసిస్ సెమీస్ కు చేరడం కష్టమే.
Also Read : ఐర్లాండ్ పై విక్టరీ సెమీస్ కు కివీస్