Virat Kohli Birth Day : ధీరుడా ప‌రుగుల వీరుడా సాగిపో

ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ వెరీ స్పెషల్

Virat Kohli Birth Day : భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్, మాజీ కెప్టెన్..ర‌న్ మెషీన్ గా పేరొందిన విరాట్ కోహ్లీ పుట్టిన రోజు(Virat Kohli Birth Day) ఇవాళ్ల‌. న‌వంబ‌ర్ 5తో 34 ఏళ్లు పూర్త‌య్యాయి. త‌న కెరీర్ లో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. అద్భుత‌మైన క్రికెట‌ర్ గా పేరొందాడు. ఎక్క‌డా ఓట‌మిని ఏ కోశాన ఒప్పుకోని మ‌న‌స్త‌త్వం కోహ్లీది.

అందుకే అత‌డి దూకుడుకు విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. విచిత్రం ఏమిటంటే వ‌ర‌ల్డ్ వైడ్ గా టాప్ 10 మంది ప్లేయ‌ర్ల‌లో అన్ని క్రీడా రంగాల‌లో మ‌నోడు కూడా ఒక‌డుగా ఉండ‌డం విశేషం. కెరీర్ ప‌రంగా 2008లో స్టార్ట్ చేశాడు. ఆనాటి నుంచి నేటి దాకా అనేక ఫీట్ లు సాధిస్తూ ముందుకు దూసుకు వెళుతున్నాడు.

ఇటీవ‌లి కాలంలో కొంత ఫామ్ లేమితో ఇబ్బంది ప‌డ్డా దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ నుంచి జోరు పెంచాడు. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2022లో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ త‌ర‌పున అత్య‌ధిక ర‌న్స్ చేశాడు.

త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. ప్ర‌ధానంగా ప్రారంభ మ్యాచ్ లో ఓడి పోతుంద‌ని అనుకున్న భార‌త జ‌ట్టును పాకిస్తాన్ పై గెలిచేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ గా నిలిచాడు. 2008లో విరాట్ కోహ్లీ నాయ‌క‌త్వ‌లో టీమిండియా అండ‌ర్ -19 ప్ర‌పంచ్ క‌ప్ గెలుపొందింది. తొలి వ‌న్డేలో శ్రీ‌లంక‌పై కోహ్లీ ఇంట‌ర్నేష‌న‌ల్ అరంగేట్రం చేశాడు కోహ్లీ. టి20 లో మొద‌టి మ్యాచ్ 2010లో జింబాబ్వేతో ఆడాడు.

2009లో శ్రీ‌లంక‌పై సెంచ‌రీ చేశాడు. టి20ల్లో 1016 ప‌రుగులు చేసిన మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ. ఇప్ప‌టి వ‌ర‌కు అతి త‌క్కువ ఫార్మాట్ లో 3,932 ర‌న్స్ సాధించాడు. 2012లో ఐసీసీ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ గా ఎంపిక‌య్యాడు. ప్ర‌పంచ క‌ప్ అరంగేట్రంలోనే సెంచ‌రీ చేసిన ఏకైక భార‌త క్రికెటర్ గా నిలిచాడు కోహ్లీ.

2013లో ఆసిస్ తో జ‌రిగిన మ్యాచ్ లో 52 బంతుల్లోనే ఫాసెస్ట్ సెంచ‌రీ చేశాడు. టెస్టుల్లో వ‌రుస‌గా నాలుగు సీరీస్ ల‌లో డ‌బుల్ సెంచ‌రీలు చేసిన తొలి

బ్యాట‌ర్ గా కూడా రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ , ఇంగ్లండ్ , న్యూజిలాండ్ , బంగ్లాదేశ్ ల‌పై కోహ్లీ నాలుగు టెస్టు డ‌బుల్ సెంచ‌రీలు చేయ‌డం విశేషం.

అంత‌ర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఇప్ప‌టి దాకా 71 సెంచరీలు చేశాడు. మూడు ఫార్మాట్ ల‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన బ్యాట‌ర్ జాబితాలో రెండ‌వ స్థానంలో నిలిచాడు. ఎలైట్ బ్యాట‌ర్ల జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్ టాప్ లో ఉన్నాడు. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ మూడు ఫార్మాట్ ల‌లో 100 సెంచ‌రీలు చేశాడు.

వ‌న్డేల్లో అత్యంత ఫాస్ట్ గా 1000, 5000, 6000, 7000, 8000, 9000, 10000, 11000, 12000 ప‌రుగుల మార్క్ ను దాటిన భార‌త ఆట‌గాడు కోహ్లీ ఒక్క‌డే.

ఆస్ట్రేలియాపై తొమ్మిది సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా గుర్తింపు పొందాడు. 95 మ్యాచ్ ల‌కు భార‌త జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు కోహ్లీ.

300వ వ‌న్డే లో ఉద్వేగానికి లోనైన విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోనిని ఉద్దేశించి నువ్వు ఎప్ప‌టికీ మాకు ఎప్ప‌టికీ కెప్టెన్ గా ఉంటాడ‌ని పేర్కొన్నాడు. 65 వ‌న్డేల్లో

విజ‌యం సాధించి పెట్టాడు. టి20 ల్లో కోహ్లీ 50 సార్లు టీమిండియాకు సార‌థ్యం వ‌హించాడు. 30 మ్యాచ్ ల‌లో గెలుపొందింది.

68 మ్యాచ్ ల‌కు టెస్టులలో నాయ‌కుడిగా ఉన్నాడు. ఇందులో 40 మ్యాచ్ ల‌లో గెలిపించాడు. ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ప్రారంభ ఎడిష‌న్ లో

టీమిండియాను ఫైన‌ల్ కు చేర్చాడు. 58.82 విజ‌య శాతంతో కోహ్లీ భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా నిలిచాడు.

ఇక ఐపీఎల్ లో 2013 నుంచి 2021 వ‌ర‌కు ఐపీఎల్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు కెప్టెన్ గా ఉన్నాడు. టెస్టుల్లో 8074 ర‌న్స్ చేశాడు. 28 హాఫ్ సెంచ‌రీలతో పాటు 27 సెంచ‌రీలు సాధించి త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు.

Also Read : ఆసిస్ సెమీస్ కు వెళ్ల‌డం క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!