Danushka Gunathilaka : గుణతిలకపై శ్రీలంక బోర్డు నిషేధం
అత్యాచారం ఆరోపణలపై అరెస్ట్
Danushka Gunathilaka : శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకను(Danushka Gunathilaka) ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక జట్టు గుణతిలక లేకుండానే శ్రీలంకకు వచ్చేసింది.
ఈ తరుణంలో శ్రీలంక క్రికెట్ బోర్డు సమావేశమైంది. ఈ మేరకు దనుష్క గుణతిలకకు షాక్ ఇచ్చింది. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ లను నుంచి దనుష్క గుణతిలకను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియాలో గుణలికపై కేసు నమోదైంది.
కోర్టు కేసుకు సంబంధించి విచారణ ముగిశాక దోషిగా తేలితే దనుష్క గుణతిలకకు జరిమానా విధించేందుకు సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేసింది శ్రీలంక క్రికెట్ బోర్డు.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది బోర్డు. టి20 వరల్డ్ కప్ లో ఆడుతున్న సమయంలో దనుష్క గుణతిలక ఓ 29 ఏళ్ల వయసు కలిగిన
ఆస్ట్రేలియా మహిళతో ఆన్ లైన్ లో డేటింగ్ సైట్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు.
ఈ ఇద్దరూ చాలా రోజులు టచ్ లో ఉన్నట్లు టాక్. నవంబర్ 2న ఆస్ట్రేలియాలోని రోజ్ బే లోని ఓ హొటల్ గదిలో కలుసుకున్నారు. అయితే ఉన్నట్టుండి దనుష్క గుణతిలక తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బాధిత మహిళ ఆరోపించింది.
ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం ఆదివారం ఉదయం గుణతిలకను అరెస్ట్ చేసింది.
Also Read : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా కోహ్లీ