Elon Musk Tesla : $4 బిలియన్ల టెస్లా షేర్ల విక్రయం
కీలక నిర్ణయం తీసుకున్న ఎలాన్ మస్క్
Elon Musk Tesla : ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకుంటూ సంచలనాలకు తెర తీస్తున్నారు. తాజాగా టెస్లా స్టాక్ లో దాదాపు $4 బిలియన్లను విక్రయించింది. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ డాక్యుమెంట్లు టెస్లా స్టాక్ తో తన ట్విట్టర్ కొనుగోలులో ఎక్కువ భాగం ఆర్థిక సాయం చేశారు మస్క్. దాదాపు $3.95 బిలియన్ల విలువైన 19.5 మిలియన్ షేర్లను విక్రయించారు.
టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్(Elon Musk Tesla) ఎలక్ట్రిక్ కార్ కంపెనీలో దాదాపు పెద్ద ఎత్తున బిలియన్ల విలువైన షేర్లను విక్రయించారు. ఎస్ఈసీ ఫైలింగ్స్ తన 44 బిలియన్ డాలర్ల ట్విట్టర్ కొనుగోలును మూసి వేసిన వారం తర్వాత చూపించాయి.
యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ పత్రాలు టెస్లా స్టాక్ తో తన ట్విట్టన్ కొనుగోలు పూర్తి చేశాక భారీ ఎత్తున తన సంస్థకు చెందిన షేర్లను విక్రయించినట్లు చూపిస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నాడు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్(Elon Musk Tesla). మైక్రో బ్లాగింగ్ సంస్థ కొనుగోలు విషయంలో ముందూ వెనుకా ఆలోచిస్తుండగా ఒక్కసారిగా దాని ప్రభావం ట్విట్టర్ తో పాటు టెస్లా కంపెనీలపై పెను ప్రభావం చూపింది.
దీంతో ముందస్తుగా ఈ ప్రమాదాన్ని గమనించిన ఎలాన్ మస్క్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ట్విట్టర్ ను రూ. 4,400 కోట్లకు డీల్ ఓకే చేసుకున్నాడు. ఆపై టాప్ ఎగ్జిక్యూటివ్ లతో పాటు 3,978 మందిని తొలగించారు.
ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఖర్చు చేసిన డబ్బులను తిరిగి భర్తీ చేసేందుకు గాను తన మాతృ సంస్థ టెస్లా విద్యుత్ కార్లకు సంబంధించిన షేర్లను విక్రయించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఎలాన్ మస్క్ ఏది చేసినా అది సంచలనమే.
Also Read : ట్విట్టర్ లో కీలక మార్పు