Ravindra Jadeja Modi : భార్యకు టికెట్ పీఎంకు థ్యాంక్స్ – జడేజా
రివాబాకు అసెంబ్లీ టికెట్ కేటాయింపు
Ravindra Jadeja Modi : ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తన భార్య రివాబా జడేజాకు ప్రస్తుతం రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున టికెట్ కేటాయించింది.
కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ గురువారం రాష్ట్రానికి సంబంధించి మొత్తం 182 స్థానాలకు గాను 160 స్థానాలకు బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను వెల్లడించారు.
ఇందులో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయిన హార్దిక్ పటేల్ తో పాటు రవీంద్ర జడేజా భార్యకు టికెట్లను కేటాయించారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన గుజరాత్ లోని మోర్బీ వంతెన కూలిన ఘటనలో మోర్బీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్ ఇచ్చింది పార్టీ. ఆయనను తొలగించింది.
ప్రాణాలు కాపాడిన మాజీ ఎమ్మెల్యే కు టికెట్ కేటాయించింది. ఈ తరుణంలో జడేజా భార్య రివాబా గత మూడేళ్ల కిందట భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆనాటి నుంచి పార్టీ కోసం పని చేస్తూ వస్తున్నారు. ఇటీవలే రవీంద్ర జడాజే(Ravindra Jadeja Modi) తన భార్యతో కలిసి దేశ ప్రధాన మంత్రిని నివాసంలో కలుసుకున్నారు.
తాజాగా తన భార్యకు టికెట్ వస్తుందని అనుకోలేదని ఇదంతా పీఎం చలవేనంటూ సంతోషం వ్యక్తం చేశారు రవీంద్ర జడేజా. క్రికెట్ లో ఆల్ రౌండర్ గా పేరొందిన జడేజా ఈ ఎన్నికల్లో తన భార్యను ఎలా గెలిపించుకుంటాడో చూడాల్సి ఉంది. మొత్తంగా ఈసారి ఎన్నికల రసవత్తరంగా మారనున్నాయి.
జడేజా భార్యకు టికెట్ కేటాయింపు ఆసక్తికరంగా మారింది.
Also Read : సత్తా చాటిన కోహ్లీ..హార్దిక్ పాండ్యా