UIDAI : ఆధార్ అప్ డేట్ చేసుకోక పోతే ఏమీ కాదు
ఆధార్ లో మార్పులు తప్పనిసరి కాదు
UIDAI : మీరు ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోలేదా. మీకు సంక్షేమ పథకాలు రావని ఎవరైనా చెప్పారా లేక ఏదైనా సమాచారం వచ్చిందా. దీని గురించి ఎలాంటి బాధ పడాల్సిన పని లేదు. అప్ డేట్ చేసుకోక పోయినా వచ్చిన ముప్పేమీ ఉండదని ప్రకటించింది యూఐడీఏఐ(UIDAI) . ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
దేశ వ్యాప్తంగా 137 కోట్ల మంది ప్రజలకు ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. దేశంలో ఏది పొందాలనా లేక ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా, ఇతర దేశాలకు వెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. చాలా మంది వివిధ పనుల నిమిత్తం, ఉద్యోగ రీత్యా, ఉపాధి కోసం , ఇతర అవసరాల కోసం ఒక చోటు నుంచి మరో చోటుకు మారడం మామూలుగా మారింది.
ఈ తరుణంలో ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఉంటున్నట్లు ఆధార్ కార్డులో పూర్తిగా వివరాలలో మార్పులు చేసుకుంటున్నారు. దీంతో ఆధార్ కార్డుల అప్ డేట్స్ విషయంలో పెద్ద తలనొప్పిగా మారింది యూఐడీఏఐకి. ఆధార్ కార్డును(UIDAI) ఇప్పటి వరకు కలిగి ఉన్న వారు తాజా వివరాలతో అప్ డేట్ చేసుకోక పోయినా పర్వాలేదు.
ఏమీ కాదని. అదేమంత నేరంగా భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక నుంచి ఎప్పటి లాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లబ్ది పొందే వారికి ఎలాంటి నష్టం వాటిల్లదని పేర్కొంది. ఇలా ఎవరైనా చెప్పినా వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా తమకు అనుగుణంగా ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలని అనుకుంటే దానికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని యూఐడీఏఐ వెల్లడించింది.
Also Read : చెన్నై మైసూర్ వందే భారత్ రైలు షురూ