Kapil Dev : టీమిండియాలో ప్రొఫెషనలిజం లేదు
భారత జట్టు ఓటమిపై కపిల్ కామెంట్స్
Kapil Dev : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోరమైన ఓటమిని చవి చూసింది భారత జట్టు. ఈ సందర్భంగా తాజా, మాజీ ఆటగాళ్లు టీమిండియా ఆట తీరుపై నానా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రధానంగా ఒకరు ఇద్దరు తప్పితే మిగతా వాళ్లంతా అత్యంత బాధ్యతా రాహిత్యంతో ఆడారంటూ పేర్కొన్నారు.
ఈ తరుణంలో సీరియస్ గా స్పందించాడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నిఖంజ్. ఎవరిని తప్పు పట్టాలో తెలియడం లేదన్నాడు. అయినప్పటికీ ఇంగ్లండ్ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందన్నాడు. కానీ ఇంత దిగజారి పరాజయం మూట గట్టుకుంటుందని తాను కలలో కూడా అనుకోలేదన్నాడు కపిల్ దేవ్(Kapil Dev).
దుబాయ్ లో గత ఏడాది 2021లో టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో సేమ్ ఇలాగే 10 వికెట్లతో ఓటమి పాలైందని గుర్తు చేశాడు. కానీ ఇక్కడ సీన్ మారిందని, సెమీస్ వరకు వచ్చిందని పేర్కొన్నాడు.
భారత జట్టులో ప్రొఫెషనలిజం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. స్థిరంగా కొన్ని మ్యాచ్ లు కంటిన్యూగా ఆడే ఆటగాళ్లు అవసరమని స్పష్టం చేశాడు కపిల్ దేవ్. పదే పదే నాకౌట్ స్థాయికి వచ్చి ఓటమి పాలవడాన్ని ఇతర జట్లను చోకర్స్ గా అభివర్ణించడం పరిపాటి.
ఇదే పదాన్ని మన జట్టు ఆటగాళ్లకు కూడా అన్వయించడంలో తప్పు లేదన్నాడు మాజీ కెప్టెన్. మరో వైపు టోర్నీలో ప్రధాన అవరోధం సూర్య కుమార్ యాదవ్ వికెట్ ను కోల్పోవడం, మరో వైపు బౌలర్లు ప్రభావం చూపలేక పోవడం ఇబ్బందికరంగా మారిందన్నాడు.
Also Read : కెప్టెన్లను మార్చుకుంటూ పోతే ఎలా – జడేజా