Rahul Dravid : రోహిత్..కోహ్లీ కొన‌సాగింపుపై ద్ర‌విడ్ కామెంట్స్

టి20 ఫార్మాట్ లో ఉంటారా..ఏమో చెప్ప‌లేం

Rahul Dravid : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇంగ్లండ్ చేతిలో చావు దెబ్బ తిన్న‌ది భార‌త జ‌ట్టు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid) మీడియాతో మాట్లాడారు.

టి20 పార్మాట్ లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, ర‌విచంద్ర‌న్ అశ్విన్ ను బీసీసీఐ కంటిన్యూ చేసే యోచ‌న‌లో లేన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై మీరు ఏమ‌ని అనుకుంటున్నారంటూ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు కీల‌క స‌మాధానం ఇచ్చారు రాహుల్ ద్ర‌విడ్.

ఆట అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జం. భార‌త జ‌ట్టు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టింది. నాకౌట్ ద‌శ‌కు కూడా రాద‌న్నారు. కానీ సెమీస్ వ‌ర‌కు వెళ్లాం. కానీ పిచ్ అనుకూలించ లేదు. మా బాయ్స్ కూడా బాగానే ఆడినప్ప‌టికీ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంద‌ని ప్రశంసించాడు.

అయితే ఒక్క మ్యాచ్ లో ఓడి పోయినంత మాత్రాన జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌ను ప‌క్క‌న పెట్ట‌లేం అంటూ స్ప‌ష్టం చేశాడు. ఇది పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నాడు. భార‌త దేశంలో వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా ఆరోప‌ణ‌లు చేసినా ఇందులో వాస్త‌వానికి ప్ర‌తి జ‌ట్టు గెలిచేందుకే ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నాడు.

ఏ జ‌ట్టు ఓట‌మి కొని తెచ్చుకోవాల‌ని అనుకోద‌న్నాడు. ఇక రోహిత్ , కోహ్లీ, అశ్విన్ ..ఇలా ప్ర‌తి ఆట‌గాళ్ల‌ను ఏ స‌మ‌యంలో ఎలా వాడుకోవాల‌నేది ముందు ముందు ఆలోచిస్తామ‌న్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని అంతా బాగుంద‌ని కితాబు ఇచ్చాడు రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid).

Also Read : టీమిండియాలో ప్రొఫెష‌న‌లిజం లేదు

Leave A Reply

Your Email Id will not be published!