Parmida Ghasemi Removes : ‘పరదా’పై పర్మిదా ఘసేమి కన్నెర్ర
ఇరాన్ ఆర్చర్ వీడియో సెన్సేషన్
Parmida Ghasemi Removes : హిజాబ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు ఇరాన్ లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆ దేశానికి చెందిన ఆర్చర్ పర్మిదా ఘసేమి(Parmida Ghasemi) ఇప్పుడు వరల్డ్ వైడ్ గా వైరల్ గా మారారు. పరదా సంస్కృతికి తాను వ్యతిరేకం అంటూ ప్రకటించారు. ఈ మేరకు ఆమె హిజాబ్ ధరించకుండానే నిల్చున్నారు. ఆపై తాను దేశంలో జరుగుతున్న హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు పర్మిదా ఘసేమి.
ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ ఇరానియన్ జర్నలిస్ట్ మాసిహ్ అలినేజాద్ ట్విట్టర్ లో షేర్ చేశారు. పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రధానంగా ఇరాన్ తో పాటు పలు ముస్లిం దేశాలలో యువతులు, బాలికలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రతి చోటా దాడులు, వివక్ష , లైంగిక పరమైన హింసకు గురవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆఫ్గనిస్తాన్ లో ముస్లిం మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వాళ్లను బయటకు వెళ్లనీయకుండా చేశారు. ఈ తరుణంలో తాజాగా ఇరాన్ ఆర్చర్ క్రీడాకారిణి పర్మిదా ఘసేమీ మరోసారి తన నిరసనను బహిరంగంగా వ్యక్తం చేశారు. ఆమెను చంపుతామని బెదిరించినా తాను లొంగే ప్రసక్తి లేదంటూ ప్రకటించారు.
ఇలా ఎంతకాలం మతం పేరుతో, ఇస్లాం పేరుతో మహిళలను హింసిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు పర్మిదా ఘసేమి. 22 ఏళ్ల మహ్సా అమిని లాకప్ డెత్ తర్వాత పశ్చిమాసియా దేశంలో అశాంతి నెలకొంది. ఇక షేర్ చేసిన వీడియోకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. పర్మిదా ఘస్సేమీ(Parmida Ghasemi Removes) గొప్ప ఆర్చర్. అధికారుల ముందు తన పరదా తీసి వేసింది. ఇరాన్ పాలనకు మరో అవమానం అంటూ పేర్కొన్నారు ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకుడు అలీ ఖమేనీ.
Also Read : రాజీవ్ హంతకుల విడుదల దారుణం – జైరాం