Anna Hazare Comment : ‘అన్నా’ ఆందోళ‌న ‘అవినీతి’పై నిర‌స‌న

మ‌రోసారి ఉద్య‌మానికి స‌న్న‌ద్ధం

Anna Hazare Comment : స‌మున్న‌త భార‌తంలో అవినీతి ఆక్టోప‌స్ లాగా అల్లుకు పోయింది. దేశ‌మంత‌టా విస్త‌రించింది. ఇప్ప‌టికే ఎన్నో ఉద్య‌మాలు అవినీతికి వ్య‌తిరేకంగా కొన‌సాగుతూ వ‌చ్చాయి. వ‌స్తూనే ఉన్నాయి. అవినీతికి వ్య‌తిరేకంగా జ‌రిగిన ఉద్య‌మం దేశ చ‌రిత్ర‌లో ఒక మైలు రాయిగా మిగిలి పోయింది.

ఆనాడు దేశంలో కాంగ్రెస్ ఉమ్మ‌డి స‌ర్కార్ ఉండేది. ఆ త‌ర్వాత దేశ రాజ‌ధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌స్తే దేశంలో కాషాయం జెండా ఎగ‌ర‌డం ప్రారంభించింది. మొత్తంగా అవినీతి పెరిగి పోయింద‌ని దీనికంత‌టికి కాంగ్రెస్ పార్టీ అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌డంలో బీజేపీ, దాని అనుబంధ సంస్థ‌లు పెద్ద ఎత్తున స‌క్సెస్ అయ్యాయి.

ఆ మ‌హోద్య‌మం చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోవ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించింది మాత్రం ఒకే ఒక్క‌రు ఆయ‌నే వాటర్ షెడ్ కు ప్రాణం పోసిన

సామాజిక‌, హ‌క్కుల కార్య‌క‌ర్త‌, ఉద్య‌మ నేత అన్నా హ‌జారే. అన్నా హ‌జారే(Anna Hazare)  వెనుక ఎన్నో ప్ర‌గ‌తిశీల శ‌క్తులు ప‌ని చేశాయి.

మాన‌వ‌, ప్ర‌జా హ‌క్కుల సంస్థ‌లు, ర‌చ‌యిత‌లు, క‌ళాకారులు, మేధావులు, జ‌ర్న‌లిస్టులు, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు, మాన‌వ‌తావాదులు, యువ‌తీ యువ‌కులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

త‌మ సంపూర్ణ స‌హ‌కారం అంద‌జేశారు. ప్ర‌శాంత్ భూష‌ణ్ , అర‌వింద్ కేజ్రీవాల్, యోగేంద్ర యాద‌వ్ , మంద కృష్ణ మాదిగ‌, కిర‌ణ్ బేడి, త‌దిత‌ర ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున దేశంలో వెలుగులోకి వ‌చ్చారు.

ఒక కొత్త ప్ర‌పంచం వారిని ఆహ్వానించింది. దేశానికి దిశా నిర్దేశం చేస్తూ ముందుకు తీసుకు వెళ‌తార‌ని ఆశించారు కోట్లాది మంది ప్ర‌జ‌లు. అవినీతి వ్య‌తిరేక

ఉద్య‌మం ఒక ఉప్పెన‌లా కొన‌సాగింది. కానీ ఆశించిన ల‌క్ష్యం ప‌క్క‌దారి ప‌ట్టింది. ఏ ఉద్య‌మానికి అన్నా హ‌జారే ఊపిరి పోశాడో అదే అన్నా ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నాడు.

ప్ర‌ధానంగా ఆయ‌న ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను ఏకి పారేశాడు. తాజాగా కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌ధానంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై నిప్పులు చెరిగారు అన్నా హ‌జారే .

2014లో ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన మోదీ ప్ర‌భుత్వంలో 75 ఏళ్ల స్వ‌తంత్ర భార‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా అవినీతి పెచ్చరిల్లి పోయింద‌ని ఆరోపించారు. ఆపై

వ్యాపార‌వేత్త‌లు, ఆర్థిక నేర‌గాళ్లు, కార్పొరేట్ శ‌క్తుల‌కు ల‌బ్ది చేకూర్చేలా చేస్తున్నారంటూ ఆవేద‌న చెందారు.

ఇదే స‌మ‌యంలో దేశానికి చెందిన అపార‌మైన వ‌న‌రులను కొంద‌రి చేతుల్లోకి చేర‌వేసే ప‌నిలో మోదీ బిజీగా మారారంటూ ఫైర్ అయ్యారు అన్నా హ‌జారే.

ఒక ర‌కంగా దేశంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేకుండా పోతోంద‌ని, ధ‌న‌స్వామ్యంగా మారింద‌ని డ‌బ్బులు లేకుండా ఓట్లు వేసే ప‌రిస్థితి లేకుండా పోవ‌డం దారుణ‌మ‌న్నారు సామాజిక ఉద్య‌మ నేత‌(Anna Hazare Comment). 

దేశంలో ప్ర‌భుత్వం అన్న‌ది లేద‌ని ప‌బ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారి పోయిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.తాను మ‌రోసారి అవినీతికి  వ్య‌తిరేకంగా 

మ‌రో పోరాటానికి సిద్దం అవుతాన‌ని ప్ర‌క‌టించారు. 

అన్నా హ‌జారే కు వ్య‌తిరేకంగా కాషాయం క‌న్నెర్ర చేస్తోంది. ఇదంతా ప‌క్క‌న పెడితే అన‌కొండ‌లా పేరుకు పోయిన అవినీతిపై ఎవ‌రో ఒక‌రు ముందుకు 

రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ మేర‌కు అన్నాను అభినందించాల్సిందే.

Also Read : టిప్పు సుల్తాన్ స‌మ‌ర యోధుడు కాదు

Leave A Reply

Your Email Id will not be published!