Pawan Kalyan Modi : ఇక ఏపీకి అన్నీ మంచి రోజులే – పవన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యాక
Pawan Kalyan Modi : జనసేన పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖకు వచ్చిన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జనసేన చీఫ్ భేటీ అయ్యారు. పీఎం, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దాదాపు 35 నిమిషాలకు పైగా చర్చించారు. ఇందులో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానమంత్రితో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న సమస్యల గురించి ప్రస్తావించానని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీకి మంచి రోజులు రానున్నాయని తనకు ఆ నమ్మకం ఉందన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). చాలా రోజుల తర్వాత తాను ప్రధానమంత్రిని కలిశానని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో తాను నరేంద్ర దామోదర దాస్ మోదీని కలవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు జన సేనాని. ఇదిలా ఉండగా పీఎం, పవన్ కళ్యాణ్ కలవడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం రాత్రి ఈ ఇద్దరు భేటీ కావడం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
అయితే రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, అధికారంలో ఉన్న వైఎస్ జగన్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి ఎలా ముందుకు నడవాలనే దానిపై చర్చ జరిగినట్టు సమాచారం. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో పవన్, పీఎం భేటీ కీలక మలుపుగా భావించక తప్పదు.
Also Read : గ్రానైట్ దందాలో హవాలా నిజం – ఈడీ