Airtel 5G : యూజ‌ర్ల‌కు ఎయిర్ టెల్ ఖుష్ క‌బ‌ర్

మ‌రిన్ని న‌గ‌రాల‌కు 5జీ స‌ర్వీస్

Airtel 5G : ప్ర‌స్తుతం దేశంలో 5జి హ‌వా కొన‌సాగుతోంది. ప్ర‌ధానంగా రిల‌య‌న్స్ జియో వ‌ర్సెస్ భార‌తీ ఎయిర్ టెల్ మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. ఇప్ప‌టికే స్పేస్ ద్వారా నెట్ క‌నెక్టివిటీ ఇచ్చే ప‌నిలో ప‌డ్డాయి. ఇప్ప‌టికే టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్ స్పేస్ ఎక్స్ ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.

ఇదే స‌మ‌యంలో త‌మ‌కు వ్యాపారం నిర్వ‌హించేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వాలంటూ స‌ద‌రు కంపెనీ భార‌త ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఈ త‌రుణంలో 5జీ స‌ర్వీసెస్ లో మ‌రింత పోటీ ఎదురు కానుంది. ఒక ర‌కంగా టెలికాం కంపెనీల మ‌ధ్య పోటీ యూజ‌ర్ల‌కు మ‌రింత మెరుగైన రీతిలో స‌ర్వీసులు అంద‌నున్నాయి.

తాజాగా టెలికాం రంగానికి చెందిన భారతీ ఎయిర్ టెల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇందులో భాగంగా రిల‌య‌న్స్ జియో ప‌లు న‌గ‌రాల్లో 5జీ స‌ర్వీసు అందిస్తోంది. మిగ‌తా న‌గ‌రాల‌లో అందించే ప‌నిలో ప‌డ్డ‌ది. ఇక జియోకు పోటీగా ఎయిర్ టెల్ కూడా ముందుకు వెళుతోంది. దేశంలోని ఎనిమిది న‌గ‌రాల్లో ఎయిర్ టెల్ 5జీని అందిస్తోంది.

తాజాగా ఎయిర్ టెల్ పానిప‌ట్ లో 5జీ స‌ర్వీసుల‌ను(Airtel 5G) ప్రారంభించింది. స‌ద‌రు కంపెనీ ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ , ముంబై, చెన్నై , బెంగ‌ళూరు, సిలిగురి, నాగ్ పూర్ , వార‌ణాసి స‌హా ప‌లు న‌గ‌రాలకు విస్త‌రించింది. హ‌ర్యానా రాష్ట్రంలో పానిప‌ట్ మంద‌టి 5జీ స‌ర్వీసు పొందిన న‌గ‌రంగా చేరింది. దీనిని ఎయిర్ టెల్ స‌మ‌కూరుస్తోంది.

ఇదిలా ఉండ‌గా 5జిని వాడాలంటే యూజ‌ర్లు కొత్త సిమ్ వాడాల్సిన అవ‌స‌రం లేద‌ని ఎయిర్ టెల్ పేర్కొంది.

Also Read : బ్లూ టిక్ కావాలంటే రూ. 719 చెల్లించాలి

Leave A Reply

Your Email Id will not be published!