Babar Azam PM : పీఎం కామెంట్స్ మౌనం వీడిన బాబ‌ర్

ఇంగ్లండ్ చేతిలో భార‌త్ ఓట‌మిపై ర‌చ్చ

Babar Azam PM : ఓ వైపు పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్(PM Shehbaz Sharif) త‌న స్థాయిని మ‌రిచి కామెంట్స్ చేయ‌డం క్రికెట్ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఇదే స‌మ‌యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. గ‌త కొంత కాలం నుంచి దాయాది దేశాలు పాకిస్తాన్ , భార‌త్ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది.

ఇదే క్ర‌మంలో ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. భార‌త్ చేతిలో పాకిస్తాన్ ఓట‌మి పాలైంది. కానీ అనూహ్యంగా నెద‌ర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడి పోవ‌డంతో సెమీస్ కు చేరింది పాక్ టీం. న్యూజిలాండ్ పై 7 వికెట్ల‌తో విజ‌యం సాధించి నేరుగా ఫైన‌ల్ కు దూసుకు వెళ్లింది.

ఈ త‌రుణంలో రెండో సెమీ ఫైన‌ల్ లో ఇంగ్లండ్ చేతిలో భార‌త జ‌ట్టు చిత్తుగా ఓడి పోయింది. 10 వికెట్ల తేడాతో ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఈ త‌రుణంలో మా జ‌ట్టు ముందు మీ జ‌ట్టు ఎంత అనే అర్థం వ‌చ్చేలా పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి ట్వీట్ చేస్తూ ఎద్దేవా చేశాడు. దీనిపై పెద్ద దుమారం చెల‌రేగింది.

రేపు ఆదివారం కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది ఇంగ్లండ్ తో. ఈ సంద‌ర్భంగా పాకిస్తాన్ స్కిప్ప‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్(Babar Azam) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఆట అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌న్నాడు.

ఓడి పోయినంత మాత్రాన విమ‌ర్శించ‌డం స‌బ‌బు కాద‌ని పేర్కొన్నాడు. మ‌రో వైపు ఫైన‌ల్ మ్యాచ్ లో ఒత్తిడి ఖాయంగా ఉంటుంద‌ని ఒప్పుకున్నాడు బాబ‌ర్ ఆజ‌మ్.

Also Read : సెలెక్ష‌న్ క‌మిటీ నిర్వాకం జ‌ట్టుకు శాపం

Leave A Reply

Your Email Id will not be published!