Telangana Jobs Comment : ఉద్యోగాల ఊసేది భర్తీ జాడేది
రాజకీయాలు తప్పా ఆచరణ శూన్యం
Telangana Jobs Comment : తెలంగాణలో పాలన అన్నది ఉందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. లక్షలాది మంది నిరుద్యోగులు, అభ్యర్థులు నోటిఫికేషన్లు వస్తాయని ఆపై వెంటనే జాబ్స్ చేస్తామని కలలు కన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఎంతో ఆర్భాటంగా 82 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు.
గతంలో చెప్పిన విధంగానే ఇది కూడా మారిందని తేలి పోయింది. నోటిఫికేషన్లు వేయడం, దానిపై అభ్యంతరాలు వ్యక్తం కావడం షరా మామూలై
పోయింది. అదిగో భర్తీ చేస్తున్నామంటూ ప్రకటించడం దానికి సాకులు చెప్పడం గత కొన్నేళ్లుగా నిరుద్యోగులు వింటూ వస్తున్నారు.
ఇక కొలువు రావేమోనంటూ చాలా మంది కూలీ పనులకు వెళ్లడం, ఇతర మార్గాలను వెతకడం చేస్తున్నారు. సాక్షాత్తు సీఎం చేసిన ప్రకటనకే దిక్కు
లేకుండా పోయింది. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana Jobs) ఉందో ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. మొన్న నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షపై సవాలక్ష ఆరోపణలు వచ్చాయి.
ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ జాబ్స్ భర్తీ పరంగా తెలంగాణ రాష్ట్రం కంటే ముందంజలో ఉంది. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించింది.
ఆ మేరకు నోటిఫికేషన్లు వేస్తోంది. భర్తీ ప్రక్రియ కూడా సజావుగా సాగుతోంది. అంతే కాకుండా అక్కడ ఆర్టీసీలో పని చేస్తున్న వారందరినీ ప్రభుత్వ
ఉద్యోగులుగా గుర్తించారు.
కానీ ఇక్కడ సీన్ వేరేగా ఉంది. విద్యా శాఖ గాడి తప్పింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిశ్వాల్ కమిటీ రాష్ట్రంలో 2 లక్షల దాకా ఖాళీల ఉన్నాయని నివేదిక
సమర్పించింది. కానీ సీఎం మాత్రం అన్ని లేవని కేవలం 82 వేల కంటే ఎక్కువ ఉండే ప్రసక్తి లేదంటూ సెలవిచ్చారు.
ఇక నోటిఫికేషన్లు జారీ చేసినా ఇప్పటి వరకు సీఎం ప్రకటించిన నాటి నుంచి నేటి దాకా ఒక్క పోస్టుకు సంబంధించి నియామక పత్రం అందజేసిన పాపాన పోలేదు. భవిష్యత్తులో సైతం ఉద్యోగాలు(Telangana Jobs) వస్తాయన్న నమ్మకం లేకుండా పోయింది. ఇక యూనివర్శిటీలలో భారీ ఎత్తున ఖాళీలు ఉన్నాయి.
వాటి కోసం రిక్రూట్ మెంట్ బోర్డు అని కొత్త రాగం అందుకుంది. రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదన్నారు. అన్నీ కాంట్రాక్టు జాబ్స్ కొలువు తీరాయి.
ఇక ఇటీవల పంజాబ్, ఒడిశా రాష్ట్రాలలో కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించారు ఆయా రాష్ట్రాల సీఎంలు భగవంత్ మాన్ ,
బిజూ పట్నాయక్.
త్వరలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక అదే గనుక జరిగితే ఉద్యోగాలు తెలంగాణలో
ఎండమావిగానే భావించాల్సి ఉంటుంది. ఇకనైనా నిరుద్యోగులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్రయత్నం చేయాలి. జాబ్స్ పై ఆశలు వదులు కోవడమే మంచిది.
ప్రజలు మారనంత కాలం ప్రభుత్వం , పాలక వర్గం ఇలాగే వ్యవహరిస్తూ ఉంటుంది. జవాబుదారీ తనం లేకుండా పోవడం నిరుద్యోగులకు శాపమేనని భావించక తప్పదు.
Also Read : సింగరేణిని ప్రైవేటీకరించం – మోదీ