Joyland Banned : ‘జాయ్ ల్యాండ్’ ధిక్కారం పాక్ లో క‌ల్లోలం

సైమ్ సాదిక్ తీసిన చిత్రం ఆస్కార్ ఎంట్రీకి

Joyland Banned : ఆస్కార్ పోటీకి ఎంపికైన సైమ్ సాదిక్ తీసిన జామ్ ల్యాండ్ మూవీని పాకిస్తాన్(Joyland Banned) నిషేధించింది. ఈ నిర్ణ‌యాన్ని న‌వంబ‌ర్ 11న ప్ర‌క‌టించింది. దేశ స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ చిత్రానికి 17 ఆగ‌స్టు 2022న సర్టిఫికెట్ మంజూరు చేశారు. సినిమాకు సంబంధించి ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని, అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయ‌ని అందుకే నిషేధించిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.

ఇందుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేసింది మంత్రిత్వ శాఖ‌. జోయ్ ల్యాండ్ మూవీలో స‌మాజంలోని విలువ‌లు, నైతిక ప్ర‌మాణాల‌కు అనుగుణంగా లేని అత్యంత అభ్యంత‌క‌ర‌మైన అంశాలు ఉన్నాయ‌ని పేర్కొంది.

చ‌ల‌న‌చిత్ర ఆర్డినెన్స్ సెక్ష‌న్ 9లో పేర్కొన్న మ‌ర్యాద‌, నైతిక‌త నిబంధ‌న‌ల‌కు స్ప‌ష్టంగా విరుద్ద‌మ‌ని ఫిర్యాదులు అందాయ‌ని స్పష్టం చేసింది. అందుకే దానిపై నిషేధం(Joyland Banned) విధించిన‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇక చిత్రానికి సంబంధించి లాహోర్ నేప‌థ్యంగా సాగుతుంది. రానా కుటుంబానికి చెందిన చిన్న కుమారుడు హైద‌ర్ (అలీ జునేజో) , లింగ మార్పిడి క‌ళాకారిణి బీబా (అలీనా ఖాన్ ) మ‌ధ్య జ‌రిగిన ప్రేమ క‌థ. ఈ సినిమా న‌వంబ‌ర్ 18న విడుద‌ల కావాల్సి ఉంది. న‌వంబ‌ర్ 5న ధ‌ర్మ‌శాల ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో దీనిని ప్ర‌ద‌ర్శించారు.

అద్బుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. జోయ్ ల్యాండ్ ఆస్కార్ లో ఉత్త‌మ అంత‌ర్జాతీయ ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగానికి ఎంపికైంది కూడా. ఈ సంద‌ర్భంగా కేన్స్ లో చిత్ర నిర్మాత సైమ్ సాదిక్ మాట్లాడారు. దేశంలోని సంప్ర‌దాయ శ‌క్తుల‌ను క‌ల‌వ‌ప‌రిచేలా ఇందులో స‌న్నివేశాలు ఉన్నాయ‌ని అందుకే వేటు వేశారంటూ ఆరోపించారు.

స్వ‌లింగ సంప‌ర్కాన్ని చిత్రీక‌రించినందుకు జ‌మాతే ఇస్లామీ సెనేట‌ర్ ముస్తాక్ అహ్మ‌ద్ ఖాన్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. సినిమాలో కీల‌క పాత్ర పోషించిన స‌ర్వ‌త్ గిలానీ సీరియ‌స్ గా స్పందించారు. గ‌త ఆరు ఏళ్లుగా 200 మంది పాకిస్తానీలు రూపొందించిన పాకిస్తానీ చిత్రానికి టొరంటో , కైరో, కేన్స్ ప్ర‌తి చోటా ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. కానీ పాకిస్తాన్ లో మాత్రం నిషేధానికి గురి కావ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొంది.

Also Read : పండుగ‌ల వేళ తెలుగు సినిమాల‌కే ప్ర‌యారిటీ

Leave A Reply

Your Email Id will not be published!