FIFA World Cup 2022 : ఫిఫా సంబురం కోట్ల‌ల్లో లాభం

గెలిస్తే చాలు లెక్కించ‌నంత కోట్లు

FIFA World Cup 2022 : యావ‌త్ ప్ర‌పంచం ఎంతో ఉద్విగ్న‌త‌తో ఎదురు చూసిన క్ష‌ణం పూర్త‌యింది. కోట్లాది మంది అభిమానులు ప్రేమించే ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 ప్రారంభ‌మైంది(FIFA World Cup 2022).

అర‌బ్ లోని ఖ‌తార్ వేదిక‌గా మెగా టోర్నీ స్టార్ట్ కావ‌డం అంద‌రినీ సంబ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తింది. న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఏర్పాట్లు చేశారు. ప్ర‌పంచ ఫుట్ బాల్ రంగంలో టాప్ ఆట‌గాళ్లు కొలువు తీర‌నున్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇది ప్ర‌పంచ‌పు అరుదైన పండుగ‌. అత్యంత భావోద్వేగాల‌తో ముడి ప‌డి ఉన్న ఆట‌.

ఇందులో ప్ర‌తి క్ష‌ణం అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంది. ఎవ‌రినీ అదుపులో ఉంచ‌లేం. ఆదివారం నుంచి అంటే న‌వంబ‌ర్ 20 నుంచి డిసెంబ‌ర్ 18 దాకా ఈ ఫుట్ బాల్ ఫెస్టివ‌ల్ కొన‌సాగుతుంది. మొద‌టి మ్యాచ్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న ఖ‌తార్ – ఈక్వెడార్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

దీంతో ప్ర‌పంచ క‌ప్ అధికారికంగా స్టార్ట్ అయిన‌ట్లేన‌ని భావించ‌క త‌ప్ప‌దు. ఇంత పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ఫిఫా విజేత‌ల‌కు ఎంత ప్రైజ్ మ‌నీ ద‌క్కుతుంద‌నేది అంద‌రికీ ఉత్కంఠ‌. కానీ తెలుసుకుంటే క‌ళ్లు బైర్లు క‌మ్మ‌డం ఖాయం. ఎందుకంటే ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు ఏకంగా రూ. 343 కోట్లు ద‌క్కుతాయి.

ఇక ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన జ‌ట్టుకు రూ. 245 కోట్లు ల‌భిస్తాయి. మూడో స్థానంతో స‌రి పెట్టుకున్న జ‌ట్టుకు రూ. 220 కోట్లు ద‌క్క‌నున్నాయి. నాలుగో స్థానంలో నిలిచిన టీమ్ కు రూ. 204 కోట్లు ల‌భిస్తాయి. ఒక ర‌కంగా టోర్నీ మొత్తం వేల కోట్ల‌తో ముడిప‌డి ఉంటుంది.

మ‌రో వైపు టోర్నీలో భాగంగా 5వ స్థానం నుంచి ఎనిమిదో ప్లేస్ దాకా నిలిచిన జ‌ట్ల‌కు కూడా కోట్లు ద‌క్క‌నున్నాయి. ఒక్కో జ‌ట్టుకు రూ. 138 కోట్లు ల‌భిస్తాయి. ఇక 9వ స్థానం నుంచి 16వ స్థానం వ‌ర‌కు ఉన్న జ‌ట్ల‌కు రూ. 105 కోట్లు , 17 నుంచి 32వ ప్లేస్ దాకా ఉన్న టీమ్ ల‌కు రూ. 75 కోట్లు ఇస్తారు.

Also Read : సెలెక్ష‌న్ క‌మిటీకి షాక్..ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Leave A Reply

Your Email Id will not be published!