Chiranjeevi Honoured : మెగాస్టార్ కు కేంద్రం అరుదైన గౌరవం
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్
Chiranjeevi Honoured : కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విశిష్ట సేవలు అందించినందుకు గాను టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi Honoured) ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డును ప్రకటించింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి సినిమా రంగంలోకి వచ్చారు.
ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఆయన ఫ్యామిలీనే ఇప్పుడు ఓ కుటుంబం లాగా మారింది. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనయుడు రామ్ చరణ్ , తమ్ముడు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ , వరుణ్ తేజ్, నాగేంద్ర బాబు, అల్లు అరవింద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
మిగతా వాళ్లు నటనా పరంగా రాణిస్తే మరొకరు అల్లు అరవింద్ మాత్రం తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు నిర్మాతగా. వయస్సు మీద పడినా మరింత యంగ్, ఎనర్జటిక్ గా ఉంటూ ప్రభావం చూపుతున్నారు మెగాస్టార్. ఇప్పటి వరకు చిరంజీవి 150 సినిమాలు తీశారు.
చాలా మటుకు అన్నీ విజయవంతమైన చిత్రాలే ఉన్నాయి. నాటి తరం నుంచి నేటి తరం దాకా చిరంజీవి తనదైన శైలిలో నటిస్తూ మెప్పిస్తూ వస్తున్నారు. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను కూడా స్వంతం చేసుకున్నారు. నటుడిగా సక్సెస్ అయ్యారు. కానీ పాలిటిక్స్ లో కంటిన్యూగా ఉండలేక పోయారు.
ఆయన ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సినీ రంగంలోనే కొనసాగుతున్నారు.
Also Read : మోగాస్టార్ కు అవార్డు మోదీ కితాబు