PM Modi Chiranjeevi : మోగాస్టార్ కు అవార్డు మోదీ కితాబు
విలక్షణ నటుడు అంటూ ప్రశంస
PM Modi Chiranjeevi : ఇఫీ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డును ప్రముఖ టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించింది. దీంతో దేశంలోని సినీ రంగానికి చెందిన వారే కాకుండా ఇతర రంగాలకు చెందిన వారు కూడా చిరంజీవిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.
తాజాగా వారి జాబితాలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా చేరి పోయారు. చిరంజీవి విలక్షణమైన నటుడని కితాబు ఇచ్చారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు.
తెలుగు సినిమా రంగంలో విలక్షణమైన నటుడంటూ పేర్కొన్నారు. తెలుగు సినిమా రంగానికే కాదు భారతీయ సినిమా రంగంలో కష్టపడి పైకి వచ్చిన నటుల్లో చిరంజీవి ఒకరు అని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ ను ప్రత్యేకంగా అభినందించారు కేంద్ర క్రీడా, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.
విభిన్న నటనా చాతుర్యంతో అనేక తరాల ప్రేక్షకులను సమ్మోహన పరిచారంటూ ప్రశంసించారు. ప్రస్తుతం పీఎం మోదీ మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది నెట్టింట్లో(PM Modi Chiranjeevi). ఇదిలా ఉండగా చిరంజీవి ఇప్పటి వరకు 150 సినిమాల్లో నటించారు.
ప్రస్తుతం గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికయ్యారు.
ఇదిలా ఉండగా ఇఫీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవికి అవార్డును ప్రకటించారు.
Also Read : రష్మి దేశాయ్..ఆకాంక్ష పూరి వైరల్
చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు. https://t.co/yQJsWL4qs8
— Narendra Modi (@narendramodi) November 21, 2022