David Warner : బోర్డు నిర్వాకం వార్నర్ ఆగ్రహం
ఏసీబీ తీరుపై సంచలన కామెంట్స్
David Warner : స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ గా ఇప్పటికే పేరొందాడు. కొంత కాలం పాటు ఫామ్ కోల్పోయిన వార్నర్(David Warner) ఉన్నట్టుండి మళ్లీ పుంజుకున్నాడు. ఆపై టాప్ లెవల్లో ప్రదర్శన చేస్తున్నాడు. ఈ తరుణంలో క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుపై నిప్పులు చెరిగాడు.
బాల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని సాకుగా చూపి తనపై కక్ష కట్టిందంటూ ఆరోపించాడు. విచిత్రం ఏమిటంటే ప్రపంచంలో మర్డర్లు చేసిన వారికి కూడా అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కానీ తన విషయంలో కావాలని కక్ష కట్టారంటూ బోర్డు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు డేవిడ్ వార్నర్.
తనపై జీవితకాల కెప్టెన్సీపై బ్యాన్ ను తొలగించాలంటూ పలుమార్లు క్రికెట్ బోర్డుకు విన్నవించినా పట్టించు కోలేదని వాపోయాడు. చేసిన తప్పునకు కొంత కాలం పాటు మాత్రమే శిక్ష ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. తనకు నాయకత్వం వహించాలన్నది కోరికగా ఉందని కానీ జీవిత కాలం నిషేధం పేరుతో దూరం పెట్టడం దారుణమన్నాడు డేవిడ్ వార్నర్.
2018లో జరిగిన దానికి శిక్ష కూడా అనుభవించానని చెప్పాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మనసు మార్చుకుంటుందని, తనకు ఆసిస్ జట్టుకు కెప్టెన్ గా నియమిస్తుందని అనుకున్నానని కానీ అలా జరగలేదన్నాడు. ఫించ్ రిటైర్ అయ్యాకు తనకు ఛాన్స్ వస్తుందని ఆశించానని పేర్కొన్నాడు వార్నర్.
ఇదిలా ఉండగా ఆరోన్ ఫించ్ వన్డేల నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో మాజీ క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ సైతం డేవిడ్ వార్నర్ కు కెప్టెన్సీ దక్కుతుందని భావించారు. కానీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
Also Read : చివరి మ్యాచ్ కు కేన్ మామ దూరం