Sonali Phogat : డ్రగ్స్ ఇచ్చారు సోనాలీ ఫోగట్ ను చంపేశారు
నటి, బీజేపీ నేత కేసులో సీబీఐ కోర్టుకు వెల్లడి
Sonali Phogat : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది హర్యానాకు చెందిన ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు సోనాలీ ఫోగట్. ఆమె గోవాలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఆమె వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సంగ్వాన్ , అతడి ఫ్రెండ్ సుక్వీందర్ సింగ్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి విచారణకు అప్పగించింది గోవా రాష్ట్ర ప్రభుత్వం. ఇదిలా ఉండగా సోనాలీ ఫోగట్(Sonali Phogat) ను డ్రగ్స్ తీసుకోవాలంటూ సుధీర్ సంగ్వాన్ , సుఖ్వీందర్ సింగ్ బలవంతం చేశారంటూ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత హత్య చేశారంటూ వెల్లడించింది.
మంగళవారం కోర్టుకు విచారణ నివేదికను సమర్పించింది. ఇందులో సోనాలీ ఫోగట్ కు సంబంధించిన కీలక అంశాలు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ కేసును సీబీఐకి అప్పగించే ముందు గోవా పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. సోనాలీ ఫోగట్ ఆగస్టులో చని పోయారు.
ఆమె మరణించేకంటే కొన్ని గంటల ముందు సోనాలీని డ్రగ్స్ తీసుకోవాలంటూ బలవంతం చేశారని తెలిపారు. ఈ విషయాన్ని నిందితులు ఒప్పుకున్నట్లు పేర్కొంది సీబీఐ. ఆ ఇద్దరినీ ఇప్పటికే అరెస్ట్ చేసింది సీబీఐ. నిందితులిద్దరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గోవా కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.
కాగా అంజునా బీచ్ లోని రెస్టారెంట్ , క్లబ్ కర్లీస్ లో నిందితులు సోనాలీ ఫోగట్ తో కొద్దిసేపు గడిపారు. ఆపై అక్కడే ఆమెకు డ్రగ్స్ ఇచ్చారు. నడవలేని స్థితిలో ఆమెను హోటల్ కు తీసుకు వెళ్లారని సీబీఐ పేర్కొంది.
Also Read : లిక్కర్ స్కాం కేసు డిసెంబర్ 5కు వాయిదా