Dinesh Karthik : సెలెక్టర్ల తొలగింపుపై కార్తీక్ కామెంట్స్
ఎవరూ ఊహించని నిర్ణయం ఇది
Dinesh Karthik : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీ ఫైనల్ లో ఓటమి పాలవడంతో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్టర్ల కమిటీని పూర్తిగా రద్దు చేయడం కలకలం రేపింది. ప్రధానంగా క్రికెట్ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
ఇదే సమయంలో గతంలో గంగూలీ చీఫ్ గా ఉండేవాడు. కానీ సీన్ మారింది. ప్రస్తుతం రోజర్ బిన్నీ బీసీసీఐ బాస్ గా ఎన్నికయ్యాడు. అందరినీ గంప గుత్తగా తొలగించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే సమయంలో తమకు సెలెక్టర్లు కొత్త వాళ్లు కావాలని, దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ బీసీసీఐ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందుకు సంబంధించి నవంబర్ 28 డెడ్ లైన్ ప్రకటించింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టు సభ్యుడు దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది ఎవరూ ఊహించని నిర్ణయం అని పేర్కొన్నాడు. తాను కూడా అనుకోలేదన్నాడు. కొత్త వారు ఎవరు వస్తారో వేచి చూడాలని తెలిపాడు.
ఇంగ్లండ్ చేతిలో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓటమి పాలు కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇది ఆశ్చర్యంగా ఉందని కానీ కొత్త కమిటీకి మరింత అవకాశం కల్పించడం మంచిదేనని అభిప్రాయ పడ్డాడు దినేష్ కార్తీక్(Dinesh Karthik). ఏది ఏమైనా విపరీతమైన ఒత్తిళ్లు సెలెక్షన్ కమిటీపై ఉంటుందని ఒప్పుకున్నాడు.
ఒక రకంగా తననే కాదు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు దినేష్ కార్తీక్.
Also Read : విండీస్ కెప్టెన్సీకి నికోలస్ పూరన్ గుడ్ బై