Sanju Samson : వన్డే లోనైనా శాంసన్ కు ఛాన్స్ ఇస్తారా
టి20లో దెబ్బ కొట్టిన పాండ్యా..లక్ష్మణ్
Sanju Samson : గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు కేరళ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్(Sanju Samson) . తన ఇంటర్నేషనల్ ఏడేళ్ల కెరీర్ లో పట్టుమని కొన్ని మ్యాచ్ లకే పరిమితం అయ్యాడు. ఐపీఎల్ లో సత్తా చాటడంతో ఏకంగా రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం కెప్టెన్ గా ఎంపిక చేసింది.
ఏకంగా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో తన జట్టును రన్నరప్ వరకు తీసుకు వచ్చాడు. ఇది పక్కన పెడితే సంజూ శాంసన్ రాణించినా ఇప్పటి వరకు బీసీసీఐ ఎంపిక చేయలేదు. సంజూ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా, కెప్టెన్లు మారినా ఇంకా ఎన్ని అవకాశాలు రిషబ్ పంత్ ను ఆడిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
కేరళ స్టార్ సంజూ శాంసన్ చేసిన తప్పేంటి అంటూ నిలదీస్తున్నారు. బీసీసీఐలో రాజకీయాలు చోటు చేసుకున్నాయని, సెలెక్టర్లు ఎందుకని వివక్ష చూపిస్తున్నారంటూ మండి పడుతున్నారు నెటిజన్లు. మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి , సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ సైతం సంజూ శాంసన్ కు ఆడేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు.
కానీ పట్టించు కోలేదు. న్యూజిలాండ్ టూర్ కు ఎంపిక చేసినా మూడు టి20 మ్యాచ్ ల సీరీస్ లో 1-0 తేడాతో సీరీస్ గెలుచుకుంది. ఇది పక్కన పెడితే శాంసన్ ను కాదని రిషబ్ పంత్ ను ఆడించినా ఫలితం లేకుండా పోయింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే రెండో మ్యాచ్ లో 6 పరుగులు, మూడో మ్యాచ్ లో 13 రన్స్ మాత్రమే చేసి నిరాశ పరిచాడు పంత్.
ఇంకా ఎంత కాలం ఇలా అతడిని నెట్టుకు వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కనీసం వన్డే మ్యాచ్ లలో నైనా శాంసన్ ను ఆడిస్తారా లేదా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
Also Read : సెలెక్టర్ల తొలగింపుపై కార్తీక్ కామెంట్స్