Hardik Pandya Samson : శాంస‌న్ కు ఇంకా టైం ఉంది – పాండ్యా

ఎంపిక చేయ‌క పోవ‌డంపై కామెంట్స్

Hardik Pandya Samson : న్యూజిలాండ్ టూర్ లో భార‌త జ‌ట్టు టి20 సీరీస్ ను 1-0 తేడాతో కైవ‌సం చేసుకుంది. మొద‌టి మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ద‌యింది. రెండో మ్యాచ్ లో టీమిండియా దుమ్ము రేపింది. న్యూజిలాండ్ పై 65 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. సూర్య‌కుమార్ యాద‌వ్ 51 బంతులు ఆడి 111 ర‌న్స్ తో హోరెత్తించాడు.

దీప‌క్ హూడా 4 వికెట్లు తీసి కీవీస్ ప‌త‌నాన్ని శాసించాడు. ఈ త‌రుణంలో మూడో టీ20 మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా టైగా ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 161 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. అనంతరం బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు 4 వికెట్లు కోల్పోయి 75 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

వ‌ర్షం రావ‌డంతో అర్ధాంతంగా ఆట‌ను నిలిపి వేసి టై అయిన‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు. దీంతో ఫ‌లితం ఎటూ తేల‌క పోవ‌డంతో ఒక్క మ్యాచ్ గెలిచినందుకు పాండ్యా సార‌థ్యం(Hardik Pandya) లోని భార‌త జ‌ట్టు సీరీస్ చేజిక్కించుకుంది.

ఈ సంద‌ర్భంగా ఫామ్ లో ఉన్న సంజూ శాంస‌న్ ను కాద‌ని రిష‌బ్ పంత్ ను కంటిన్యూ చేయ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా తాత్కాలిక కోచ్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ , కెప్టెన్ పాండ్యాపై ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు.

అనంత‌రం హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడారు. సంజూ శాంస‌న్(Sanju Samson) ను ఎందుకు తీసుకోలేద‌నే దానిపై స్పందించాడు. ప్ర‌తి ఒక్కరికీ అవ‌కాశాలు త‌ప్ప‌కుండా వ‌స్తాయ‌ని, కానీ వేచి చూడాల‌న్నాడు.

ఇదిలా ఉండ‌గా వ‌రుస‌గా రిష‌బ్ పంత్ ఫెయిల్ అవుతున్నా ఎందుకు తీసుకున్నారంటూ వేసిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేక పోయాడు.

Also Read : వ‌న్డే లోనైనా శాంస‌న్ కు ఛాన్స్ ఇస్తారా

Leave A Reply

Your Email Id will not be published!