Shikhar Dhawan : కెప్టెన్సీ కంటే దేశం ముఖ్యం – శిఖర్ ధావన్
షాకింగ్ కామెంట్స్ చేసిన వెటరన్ క్రికెటర్
Shikhar Dhawan : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎప్పుడు ఏం చేస్తుందో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. పూర్తిగా బీసీసీఐ భారతీయ జనతా పార్టీ ఆఫీసుగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.
మరో వైపు సోషల్ మీడియాలో కేరళ స్టార్ సంజూ శాంసన్ రాణిస్తున్నా కానీ కంటిన్యూగా ఫెయిల్యూర్ అవుతున్నా రిషబ్ పంత్ ను ఎంపిక చేస్తూ ఉండడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ టూర్ లో వన్డే జట్టు కెప్టెన్ గా ఎంపిక చేసింది.
కానీ చివరి నిమిషంలో జింబాబ్వే టూర్ కు తొలగించింది బీసీసీఐ. దీనిపై తీవ్రంగా స్పందించాడు శిఖర్ ధావన్(Shikhar Dhawan) . తాను జట్టులో ఆటగాడిగా ఉండేందుకు ఆనంద పడుతానని కానీ కెప్టెన్సీ పోయిందన్న బాధ ఉండదన్నాడు. దేశం కోసం ఆడాలన్న తపన మాత్రమే తనకు ఉంటుందన్నాడు.
గతంలో ఎన్నో మ్యాచ్ లలో నావంతు పాత్ర పోషించానని కానీ నాయకుడిగా ఉంటానా ఉండానా అన్న విషయం ఆలోచించనని స్పష్టం చేశాడు శిఖర ధావన్. రోహిత్ శర్మ కు విశ్రాంతి ఇవ్వడంతో ధావన్ ను నాయకుడిగా ఎంపిక చేసింది బీసీసీఐ.
2022లో శిఖర్ జట్టుకు నాయకత్వం వహించడం ఇది మూడోసారి. గతంలో విండీస్ వన్డే సీరీస్ లో కెప్టెన్ గా ఉన్నాడు. అంతే కాకుండా దక్షిణాఫ్రికాతో జరిగిన స్వదేశంలో వన్డే సీరీస్ కు నాయకుడిగా ఉన్నాడు. అంతే కాకుండా శ్రీలంకలో జరిగిన వన్డే సీరీస్ కు కూడా కెప్టెన్ గా వ్యవహరించాడు శిఖర్ ధావన్.
Also Read : రిషబ్ పంత్ పై ఎందుకంత ప్రేమ