Lawrence Bishnoi : సిద్దూ కేసులో ఎన్ఐఏ క‌స్ట‌డీకి ‘బిష్ణోయ్’

10 రోజుల క‌స్ట‌డీకి అనుమ‌తి ఇచ్చిన కోర్టు

Lawrence Bishnoi : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది పంజాబ్ కు చెందిన పాపుల‌ర్ సింగ‌ర్ సిద్దూ మూసేవాలా మ‌ర్డ‌ర్ కేసు. ఈ కేసులో ప్ర‌ధాన పాత్ర‌ధారుడిగా ఇప్ప‌టికే గుర్తించారు పోలీసులు. విచార‌ణ‌లో భాగంగా గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi)  ను విచారించేందుకు గాను క‌స్ట‌డీ ఇవ్వాల‌ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోరింది.

కేసు సీరియ‌స్ కావ‌డంతో ఢిల్లీ కోర్టు 10 రోజుల పాటు గ్యాంగ్ స్ట‌ర్ ను విచారించేందుకు గాను క‌స్ట‌డీకి అనుమ‌తి ఇచ్చింది. కాగా ఎన్ఐఏ 12 రోజులు కావాల‌ని కోరింది. కానీ కోర్టు కేవ‌లం ప‌ది రోజులు మాత్ర‌మే ఇచ్చింది. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించి ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు పంజాబ్ పోలీసులు.

ఢిల్లీ – ఎన్సీఆర్ కు చెందిన గ్యాంగ్ స్ట‌ర్ల‌కు ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాల కోణంపై ఏజెన్సీ విచార‌ణ జ‌రుపుతోంది. పాటియాలా హౌస్ కోర్టు ప్ర‌త్యేక న్యాయ‌మూర్తి శైలేంద్ర మాలిక్ ఎన్ఐఏ స‌మ‌ర్పించిన నివేదిక‌ను ప‌రిశీలించిన త‌ర్వాత క‌స్ట‌డీకీ ఓకే చెప్పారు.

విచార‌ణ సంద‌ర్భంగా సిద్దూ మూసే వాలా కేసును ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని ఇప్ప‌టికే స‌గం పూర్త‌యింద‌ని ఉగ్ర‌వాద కోణం ఏమైనా ఉందేమోన‌న్న అనుమానంతో గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi)  క‌స్ట‌డీ అవ‌స‌ర‌మ‌ని పేర్కొంది ఎన్ఐఏ.

ఇదిలా ఉండ‌గా సిద్దూ మూసే వాలా హ‌త్య కేసులో ఎన్ఐఏ పాత్ర ఏమిట‌ని కోర్టు ప్ర‌శ్నించింది. పాకిస్తాన్ నుంచి మెటీరియ‌ల్ వ‌స్తోంద‌ని , మూసే వాలా లాంటి వ్య‌క్తులు టార్గెట్ అవుతున్నారంటూ కోర్టుకు తెలిపింది ఎన్ఐఏ.

Also Read : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా అసీమ్ మునీర్

Leave A Reply

Your Email Id will not be published!