Farmers Long March : రైతు సంఘాల లాంగ్ మార్చ్
రాజ్ భవన్ వద్ద భారీ భద్రత
Farmers Long March : కనీస మద్దతు ధర కల్పించడంలో కేంద్రం విఫలమైందంటూ రైతు సంఘాల(Farmers Long March) ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడికి శ్రీకారం చుట్టారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతన్నలు రాజ్ భవన్ కు లాంగ్ మార్చ్ చేపట్టనున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు నిరసనగా ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు వెల్లడించారు.
శనివారం ఈ మార్చ్ కు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమ ఆందళనను ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ లకు రైతు సంఘాలు లాంగ్ మార్చ్ లు నిర్వహించనున్నాయి.
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లిస్తామని , ఇందు కోసం చట్టం తీసుకు వస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పటి వరకు ఆచరణకు నోచు కోలేదంటూ మండిపడ్డారు. ప్రధానంగా పంజాబ్ , హర్యానా, పశ్చి ఉత్తర ప్రదేశ్ నుండి వేలాది మంది రైతులు ఒక ఏడాది పాటు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల వెంట భారీ ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.
చివరకు మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన సాగు చట్టాలను రద్దు చేసింది. ఆ మేరకు ప్రధానమంత్రి ఈ సందర్భంగా జాతికి క్షమాపణలు కూడా చెప్పారు. రాష్ట్రపతి సైతం బిల్లును రద్దు చేశారు. దేశ రైతులను మోసం చేశారు. కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేలా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు హన్నన్ మొల్లా.
Also Read : అన్నదాతలకు జగనన్న తీపి కబురు