Ramdev Baba Comment : ‘బాబా’ వికారం మహిళలపై వెటకారం
పెరిగిన పైత్యం సర్వత్రా ఆగ్రహం
Ramdev Baba Comment : ఈ దేశంలో మనుషుల భావోద్వేగాలతో ఆడుకోవడం అలవాటుగా మారింది. ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నది మాత్రం రాజకీయ నాయకులు, స్వాములు, బాబాలు, యోగులు. వీరిలో అందరినీ ఒకే గాటన కట్టాల్సిన అవసరం లేదు. కొందరు మంచి వాళ్లు లేక పోలేదు. కులం, ప్రాంతం, మతం, దేవుళ్లు, నమ్మకాల పేరుతో ప్రభావితం చేస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో ఆశ్రమాలకు లెక్క లేకుండా పోయింది. ఇందులో చాలా మటుకు సేవా కార్యక్రమాలు చేస్తున్నా మిగతావన్నీ ఫక్తు రాజకీయ పార్టీలకు తాబేదారులుగా, కేరాఫ్ గా మారి పోయాయి. ఇక్కడ జరిగే ఘోరాలు, నేరాలు, కేసులు, అరెస్ట్ లు , అత్యాచారాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
2014 తర్వాత భారత దేశంలో కీలకమైన మార్పు చోటు చేసుకుంది. నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi) సారథ్యంలో భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కొలువు తీరింది.
ఆ తర్వాత రెండోసారి కూడా కాషాయం హవా కొనసాగించింది. దీంతో బాబాలు, స్వాములు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేస్తూనే వస్తున్నారు.
ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పతంజలి వ్యవస్థాపకుడు రాం దేవ్ బాబా గురించి. ఆయన గత కరోనా కాలంలో సైతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
ఆయన బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఆపై ప్రధాన మంత్రితో సన్నిహితంగా ఉండడం, ఆయనకు పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇవ్వడంతో రాం దేవ్ బాబా రాజ్యాంగేతర శక్తిగా మారారన్న ఆరోపణలు లేక పోలేదు.
ఇదే సమయంలో కరోనా కష్ట కాలంలో విశిష్ట సేవలు అందించిన వైద్యులపై చౌకబారు కామెంట్స్ చేశారు. చివరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్
కేంద్ర సర్కార్ కు ఝలక్ ఇచ్చింది.
దీంతో దెబ్బకు దిగి వచ్చారు రాం దేవ్ బాబా(Ramdev Baba). తాజాగా మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేసి వెలుగులోకి వచ్చారు.
ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధానంగా సమాజంలో కీలక పాత్ర పోషిస్తూ, కుటుంబాలకు ఆధారంగా ఉంటూ దేశాభివృద్దిలో పాలు పంచుకుంటున్న మహిళల పట్ల చులకనగా మాట్లాడారు. అత్యంత జుగుస్సాకరమైన రీతిలో వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం దేశమంతటా రాం దేవ్ బాబాపై(Ramdev Baba) మహిళలు, యువతులు భగ్గుమంటున్నారు. విచిత్రం ఏమిటంటే మహారాష్ట్ర లో జరిగిన
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ భార్య అమృత ముందే వ్యాఖ్యలు చేయడం విస్తు పోయేలా చేసింది.
ఆయన అన్న మాటలు సభ్య సమాజమే కాదు స్త్రీ జాతి కూడా తల వంచుకునేలా చేసింది. మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు..సల్వార్ సూట్ లో
కూడా మెరిసి పోతారు. నా దృష్టిలో ఏమీ ధరించక పోయినా అందంగా ఉంటారంటూ కామెంట్ చేశారు. తనలోని కామ వికారాన్ని బయట పెట్టుకున్నారు.
ఇకనైనా రాం దేవ్ బాబా మహిళా జాతికి క్షమాపణలు చెప్పాలి. లేకపోతే బాబాను చూసుకుని మరికొందరు బాబాలు, స్వాములు రెచ్చి పోయే ప్రమాదం ఉంది.
Also Read : పాదయాత్రలో పట్టు తప్పిన ‘డిగ్గీ రాజా’