Gautam Gambhir : ఐపీఎల్ వ‌ల్ల ద‌మ్మున్నోళ్ల‌కు ఛాన్స్ – గంభీర్

విదేశీ లీగ‌ల్ ల‌లో మ‌న‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌రు

Gautam Gambhir : భార‌త మాజీ క్రికెట‌ర్, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి ఒక్క‌రు ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) ను విమ‌ర్శిస్తున్నార‌ని అది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నాడు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ వ‌ల్లే భార‌త క్రికెటర్లు ఐసీసీ, ఇత‌ర టోర్నీల‌లో రాణించ లేక పోతున్నార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు గౌత‌మ్ గంభీర్. ఐపీఎల్ వ‌ల్ల‌నే ప్ర‌తిభ క‌లిగిన ఆట‌గాళ్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నార‌ని స్పష్టం చేశాడు. ఒక‌ప్పుడు ఆట‌గాళ్లు లేక‌, దొర‌క‌క సెలెక్ష‌న్ క‌మిటీకి ఇబ్బందిగా ఉండేద‌ని కానీ ఇప్పుడు ఒక్కో స్థానానికి న‌లుగురు లేదా ఐదుగురు క్రికెట‌ర్లు పోటీలో ఉన్నార‌ని ఇదంతా ఐపీఎల్ వ‌ల్ల‌నే జ‌రిగింద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు.

ఇదిలా ఉండ‌గా గౌత‌మ్ గంభీర్ ల‌క్నో టీంకు మెంటార్ గా ఉన్నాడు. ఇదిలా ఉండ‌గా ప‌దే ప‌దే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఫిక్కీ ప్ర‌ధాన క్రీడ‌ల విభాగం చైర్ ప‌ర్స‌న్ స‌న్ జోగ్ గుప్తా చేతుల మీదుగా ఇవాళ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) ప్ర‌శంసా ప‌త్రాన్ని అందుకున్నారు.

ఐపీఎల్ వ‌ల్ల‌నే ఆట‌గాళ్ల‌కు మేలు జ‌రిగింద‌ని మ‌రోసారి స్పష్టం చేశాడు. ఆట‌గాళ్లు ఆడ‌క పోతే బీసీసీఐని ఎలా నిందిస్తారంటూ ప్ర‌శ్నించాడు. ఐపీఎల్ ద్వారా వ‌చ్చిన ఆదాయం వ‌ల్ల కింది స్థాయిలో ఉన్న ఆట‌గాళ్ల‌కు ఎంతో ఆర్థికంగా ఉప‌యోగ ప‌డింద‌ని చెప్పాడు. దీని వ‌ల్ల మేలు త‌ప్ప కీడు ఏమీ జ‌ర‌గ‌లేద‌న్నాడు గౌతమ్ గంభీర్.

Also Read : బీసీసీఐపై నిప్పులు చెరిగిన నెహ్రా

Leave A Reply

Your Email Id will not be published!