Amit Shah Comment : గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ‘ఒకే ఒక్క‌డు’

అన్నీ తానైన ట్ర‌బుల్ షూట‌ర్

Amit Shah Comment : యావ‌త్ దేశం ఇప్పుడు గుజ‌రాత్ వైపు చూస్తోంది. మ‌రో వైపు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో కూడా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నా ప్ర‌ధానంగా ఫోక‌స్ మాత్రం గుజ‌రాత్ మీదే ఉంది. డిసెంబ‌ర్ 1, 5 తేదీల‌లో రెండు విడత‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇదే స‌మ‌యంలో గ‌త 27 ఏళ్లుగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తోంది.

ప్ర‌స్తుతం మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చేందుకు పావులు క‌దుపుతోంది. దేశానికి పెద్ద దిక్కుగా ఉంటూ, ప్ర‌పంచ వ్యాప్తంగా మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా పేరొందిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ట్ర‌బుల్ షూట‌ర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) కు కీల‌కంగా మారాయి ఈ ఎన్నిక‌లు.

గ‌త ఎన్నిక‌ల్లో ద్విముఖ పోటీ మాత్ర‌మే ఉండేది. కానీ ఈసారి ఎన్నిక‌ల్లో చ‌తుర్ముఖ పోటీ నెల‌కొంది. అధికారంలో ఉన్న బీజేపీతో పాటు కాంగ్రెస్ , ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం కూడా బ‌రిలో నిలిచాయి. 

అతిర‌థ మహార‌థుల సార‌థ్యంలో ఆయా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్ర‌ధానంగా అంద‌రికంటే ముందు గుజ‌రాత్ రాష్ట్రంలో పాగా వేశారు 

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. ఆ త‌ర్వాత బీజేపీ నుంచి మొద‌ట‌గా అమిత్ షా రంగంలోకి దిగారు. 

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చార బాధ్య‌త‌ల‌నే కాదు తిరిగి కాషాయాన్ని ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు.మ‌రో వైపు ప్ర‌ధాన మంత్రి మోదీకి ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి.

 త‌న ప‌నితీరుకు రాష్ట్ర ఎన్నిక‌లు రెఫ‌రెండంగా భావిస్తున్నారు. మ‌రో వైపు ఎన్నిక‌ల మేనిఫెస్టోల‌ను విడుద‌ల చేశాయి ఆయా పార్టీలు. మ‌రో వైపు 

ముస్లిం ఓటు బ్యాంకును చీల్చేందుకు ఎంఐఎం మొద‌టిసారిగా రాష్ట్రంలో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగింది.

ఆ పార్టీ త‌ర‌పున చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ రంగంలోకి దిగారు. ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పై ఆధార‌ప‌డి ఉంది. ఇప్ప‌టికే పార్టీ హైకాండ్ 40 మంది స్టార్ క్యాంపెయిన‌ర్ల‌ను నియ‌మించింది. 

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఒన్ మ్యాన్ షో న‌డుస్తోంది. రాహుల్ గాంధీ గుజ‌రాత్ లో ప‌ర్య‌టించారు. మ‌ళ్లీ ఎప్ప‌టి లాగే భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొంటున్నారు. తాము చేసిన అభివృద్ది ప‌నులే త‌మ‌ను గెలిపిస్తాయ‌ని బీజేపీ భావిస్తోంది. 

మ‌రో వైపు అమిత్ చంద్ర షా(Amit Shah) ఆల్ రెడీ ఎన్నిక‌ల యుద్ద క్షేత్రంలో నిమ‌గ్న‌మై ఉండ‌డంతో ఆ పార్టీ నిశ్చింతగా ఉంది. సీఎం ఉన్నా 

మొత్తం త‌తంగం, మంత్రాంగం షానే న‌డుపుతున్నారు. అన్నీ తానై ఒకే ఒక్క‌డిగా చ‌క్రం తిప్పుతున్నారు. 

ఎన్నిక‌ల‌య్యాక కాంగ్రెస్ ప్ర‌భావం చూపిస్తుందా లేక అర‌వింద్ కేజ్రీవాల్ షాక్ ఇస్తారా..ఓవైసీ ఓట్లు చీల్చుతాడా లేక మ‌రోసారి క‌మ‌లం విక‌సిస్తుందా అన్న‌ది డిసెంబ‌ర్ లో ఎన్నిక‌ల‌య్యాక తేల‌నుంది. అప్ప‌టి వ‌ర‌కు అమిత్ షా ఏం చేస్తున్నార‌నేది మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌గా మారింది.

Also Read : పార్టీకి గెహ్లాట్ ముఖ్యం..పైల‌ట్ అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!