Forbes Richest List 2022 : ప్ర‌పంచ కుబేరుల్లో అదానీ..అంబానీ

పోర్బ్స్ టాప్ 10 రిచెస్ట్ లిస్ట్ విడుద‌ల‌

Forbes Richest List 2022 : ప్ర‌తి ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా ధ‌నవంతుల జాబితాను ప్ర‌క‌టిస్తూ వ‌స్తుంది ఫోర్బ్స్(Forbes Richest List 2022) . ఈ ఏడాది 2022కు సంబంధించి పురుషుల రిచెస్ట్ లిస్టు రిలీజ్ చేసింది.

అందులో టాప్ 10 ధ‌న‌వంతుల్లో భార‌త దేశానికి చెందిన ఇద్ద‌రికి చోటు ల‌భించింది. వారిలో ఒక‌రు అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ కాగా మ‌రొక‌రు రిల‌య‌న్స్ సంస్థ‌ల గ్రూప్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ ఉన్నారు.

మ‌రో వైపు ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా సంస్థ ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్నాక ఎలాన్ మ‌స్క్ చైర్మ‌న్ గా ఉన్న టెస్లాపై ఎఫెక్టు ప‌డింది. కొన్ని కీల‌క సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌డం, చాలా మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం ట్విట్ట‌ర్ షేర్స్ పై ప్ర‌భావం చూపింది. దీంతో కొంత మేర‌కు ఆయ‌న ఆదాయం త‌గ్గుతూ వ‌చ్చింది.

కానీ గ‌త కొంత కాలం నుంచి త‌న స్థానాన్ని కాపాడుకుంటూ వ‌స్తున్నారు ఎలాన్ మ‌స్క్. గ‌త ఏడాదిలోనే కాదు ఈ ఏడాది కూడా ఎలాన్ మ‌స్క్ టాప్ లో నిల‌వ‌డం విశేషం. ఇక ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన మేర‌కు మొత్తం త‌మ లిస్టులో ప్ర‌పంచ వ్యాప్తంగా 2,668 మంది ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

ఇక మ‌న భార‌తీయ వ్యాపార వేత్త‌ల సంప‌ద గ‌తంలో కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో కంటే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ కొలువు తీరాక అమాంతం పెరిగింది. దీనిపై ఇప్ప‌టికే రాహుల్ గాంధీ నిప్పులు చెరుగుతున్నారు.

ఇక రిచెస్ట్ జాబితాలో టాప్ 10లో మూడో స్థానంలో గౌత‌మ్ అదానీ కొన‌సాగుతుండ‌గా ఎనిమిదో స్థానంలో ముకేశ్ అంబానీ నిలిచారు.

Also Read : ఫోర్బ్స్ లిస్టులో ఫ‌ల్గుణి..సావిత్రి జిందాల్

Leave A Reply

Your Email Id will not be published!