Womens IPL : విమెన్ ఐపీఎల్ లో ఫ్రాంచైజీ ధ‌ర రూ. 400 కోట్లు

భారీ ఎత్తున స‌మ‌కూరనున్న ఆదాయం

Womens IPL : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి కాసుల పంట పండ‌నుంది. ఇప్ప‌టికే ఈ ఏడాదిలో నిర్వహించాల‌ని అనుకున్నా కొన్ని అనివార్య కార‌ణాల రీత్యా మ‌హిళ‌ల (విమెన్ ) ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) (Womens IPL) ను నిర్వ‌హించ లేక పోయింది. ఇప్ప‌టికే వ‌చ్చే ఏడాది 2023 విమెన్ ఐపీఎల్ ను చేప‌ట్టేందుకు నిర్ణ‌యించింది బీసీసీఐ.

ఈ మేర‌కు ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి ఆయా మ‌హిళా జ‌ట్ల‌ను టేకోవ‌ర్ చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ఇప్ప‌టికే త‌హ త‌హ లాడుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున పురుషుల ఐపీఎల్ కు ధీటుగా విమెన్ ఐపీఎల్ ను నిర్వ‌హించే యోచ‌న‌లో సిద్ద‌మై ఉంది బీసీసీఐ.

తాజాగా అందిన విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు మ‌హిళ‌ల ఐపీఎల్ ఫ్రాంచైజీ బేస్ (ప్రారంభ‌) ధ‌ర రూ. 400 కోట్లుగా నిర్ణ‌యించిన‌ట్లు టాక్. ఈ మేర‌కు బీస‌సీఐ ఐదు జ‌ట్ల‌కు టెండ‌ర్ వేయ‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇ వేలానికి సంబంధించిన టెండ‌ర్ ప‌త్రాన్ని బీసీసీఐ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది.

ఇప్పటికే ఉన్న అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ఇ – వేలంలో పాల్గొన‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో మెన్ ఐపీఎల్ లో కొలువు తీరిన 10 ఫ్రాంచైజీలు విమెన్ ఐపీఎల్ లో కూడా జ‌ట్ల‌ను చేజిక్కించు కునేందుకు పోటీ ప‌డే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండ‌గా ముంబైలో జ‌రిగిన 91వ వార్షిక స‌ర్వ స‌భ్య స‌మావేశంలో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు విమెన్ ఐపీఎల్ చేప‌ట్టేందుకు తీర్మానం చేసింది.

మొత్తంగా మ‌రో 2 నుంచి 5 వేల కోట్ల దాకా బీసీసీఐకి ఆదాయం ద‌క్క‌నుంది.

Also Read : మూడో వ‌న్డే లో శాంస‌న్ కు ద‌క్క‌ని ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!