Giriraj Singh : లవ్ జిహాద్ ఉగ్రవాదానికి మరో రూపం
కేంద్ర మంత్రి గిరి రాజ్ సింగ్ కామెంట్స్
Giriraj Singh : కేంద్ర మంత్రి గిరి రాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. లవ్ జిహాద్ అనేది ఉగ్రవాదానికి కొత్త రూపమని ఆరోపించారు. ఈ మధ్య లవ్ జిహాద్ పేరుతో మహిళలను టార్గెట్ చేస్తూ దారుణాలకు ఒడిగడుగతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదులను ఏరి పారేస్తామన్నారు.
దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయని కానీ వారి ఆటలు సాగవన్నారు. లవ్ జిహాద్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోందని, ఇది వెర్రి తలలు వేస్తోందని ధ్వజమెత్తారు.
ఉగ్రవాదం పలు రూపాలలో కొనసాగుతూ వస్తుంది. వాళ్లకు లక్ష్యం లేదు. ఒక్కటే దాడులకు పాల్పడడం, అస్థిరత పర్చడం, దేశాన్ని అల్లకల్లోలం చేయడం. కానీ అఖండ భారతాన్ని ముట్టుకునే దమ్ము ధైర్యం ఏ ఒక్కరికీ లేదన్నారు.
అనాది నుంచి దేశంలో కొనసాగుతూ వస్తున్న సనాతన ధర్మాన్ని అంతం చేసేందుకు లవ్ జిహాద్ రూపంలో ఉగ్రవాదం కుట్ర పన్నుతోందంటూ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఏకం కావాలని గిరి రాజ్ సింగ్(Giriraj Singh) పిలుపునిచ్చారు.
జనాభా నియంత్రణ చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి కీలకమైన విధానాలు దేశం సమగ్ర అభివృద్దికి కీలకం కానుందన్నారు కేంద్ర మంత్రి.
చైనాలో నిమిషానికి 10 మంది పిల్లలు జన్మిస్తుండగా భారత దేశంలో నిమిషానికి 31 మంది పిల్లలు పుడుతున్నారని దీని వల్ల అభివృద్ది సాధ్యం కాలేదన్నారు. యూపీలోని ఘాజీపూర్ లో మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : చైనాలో స్వర్ణ యుగం ముగిసింది – సునక్